Vastu Tips For Morning: ఉదయం నిద్ర లేవగానే అస్సలు చేయకూడని 5 పనులు ఇవే!

Published : Apr 21, 2026, 02:11 PM IST

ఉదయం నిద్రలేవగానే మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు మన రోజు మొత్తాన్ని ప్రభావితం చేస్తాయని మీకు తెలుసా? వాస్తు శాస్త్రం ప్రకారం, ఉదయం లేవగానే కొన్ని పనులు అస్సలు చేయకూడదట. అవి ఏంటో, మనపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
16
నిద్రలేవగానే చేయకూడని తప్పులు

ఉదయాన్నే మనం చేసే మంచి పనులు రోజంతా మనకు ఉత్సాహాన్నిస్తాయి. పొద్దున్నే మన మనసు తెల్ల కాగితంలా ఉంటుంది. అయితే మనకు తెలియకుండా ఉదయాన్నే చేసే కొన్ని తప్పులు.. మన రోజును పాడు చేస్తాయి. ప్రతి రోజు మొదలు, ముగింపు బాగుండాలంటే.. పొద్దున్నే లేవగానే కొన్ని పనులు అస్సలు చేయకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. అవేంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

26
అద్దంలో ముఖం చూడటం

చాలామంది ఉదయం లేవగానే అద్దంలో ముఖం చూసుకుంటారు. వాస్తు ప్రకారం, నిద్రపోయేటప్పుడు మన శరీరంలో కొన్ని నెగిటివ్ శక్తులు ఉంటాయి. అద్దం వాటిని మరింత పెంచుతుంది. అందుకే, పొద్దున లేవగానే అద్దం చూడొద్దు. మీ అరచేతులు చూసుకుంటూ 'కరాగ్రే వసతే లక్ష్మీ' మంత్రం లేదా ఇష్ట దైవాన్ని తలుచుకోవడం మంచిది.

36
ఎంగిలి పాత్రలు

చాలామంది రాత్రిపూట గిన్నెలు కడగకుండా సింక్‌లో అలాగే పెట్టి పడుకుంటారు. కానీ ఉదయాన్నే ఆ గిన్నెలను చూడటం మంచిది కాదు. మీరు లేవగానే సింక్‌లో ఉన్న మురికి గిన్నెలను చూడటం నెగిటివిటీని పెంచుతుంది. వీలైనంత వరకు రాత్రే పనులు ముగించుకోవాలి. ఉదయాన్నే శుభ్రమైన వంటగదిని చూస్తే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.

46
ఆగిపోయిన గడియారం

ఉదయం లేవగానే ఆగిపోయిన గడియారం లేదా పగిలిపోయిన వస్తువులను చూడటం కూడా మంచిది కాదు. పని చేయని గడియారాలను బాగు చేయించడం లేదా పడేయడం మంచిది. పడకగదిలో అనవసరమైన, పాడైపోయిన వస్తువులను ఉంచకూడదు. ఇవి ఉదయాన్నే మీ కంట పడితే అశుభ సంకేతం. ఆగిపోయిన గడియారం మీ పనులకు ఆటంకం కలిగిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

56
క్రూర జంతువుల ఫోటోలు

ప్రస్తుత రోజుల్లో ఇంట్లో క్రూర జంతువుల ఫోటోలు పెట్టుకోవడం ఫ్యాషన్‌గా మారింది. కానీ ఉదయాన్నే హింసాత్మక జంతువుల చిత్రాలను చూస్తే చిరాకు కలుగుతుంది. వాటికి బదులుగా ఉదయిస్తున్న సూర్యుడు, పువ్వులు లేదా శాంత స్వభావం ఉన్న చిత్రాలను పెట్టుకోవడం, నిద్రలేవగానే వాటిని చూడటం మంచిది. 

66
నీడను చూడవద్దు

వాస్తు శాస్త్రం ప్రకారం, ఉదయం లేవగానే మీ నీడ లేదా ఇతరుల నీడలను చూడటం అశుభం. అలా చేయడం వల్ల భయం, ఒత్తిడి పెరుగుతాయి. మీ రోజును వెలుగు, స్పష్టతతో ప్రారంభించడానికి ప్రయత్నించాలి. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తూ రోజంతా ఉత్సాహంగా, సంతోషంగా ఉండవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories