వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో మనీ ప్లాంట్ ని పెంచడం శుభప్రదంగా భావిస్తారు. ఈ మొక్క నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టి, పాజిటివ్ ఎనర్జీని పెంచుతుందని నమ్మకం. అయితే మనీ ప్లాంట్ తో పాటు మరొక మొక్క ఉంటే ఇంట్లో డబ్బులకు లోటుండదట. ఆ మొక్క ఏంటో చూద్దాం.
వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలు ఇంటి శ్రేయస్సుకు దోహదం చేస్తాయి. కొన్ని మొక్కలను ఇంట్లో పెంచడం వల్ల సుఖ సంతోషాలు పెరగడంతో పాటు డబ్బుకు లోటుండదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంట్లో మనీ ప్లాంట్ తో పాటు మరొక మొక్క ఉంటే, డబ్బు కష్టాలు ఉండవని చెబుతున్నారు. మరి ఆ మొక్క ఏంటో దానివల్ల కలిగే ఇతర ప్రయోజనాలేంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
24
సంతోషకరమైన జీవితం
సాధారణంగా వాస్తు శాస్త్రం.. పాజిటివ్, నెగిటివ్ ఎనర్జీ అనే రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగితే ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడి వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అదే పాజిటివ్ ఎనర్జీ ఉంటే, సంపద పెరిగి, కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది.
34
జెడ్ ప్లాంట్
జెడ్ ప్లాంట్ నిజానికి దక్షిణాఫ్రికాకు చెందిన మొక్క. కానీ ఇప్పుడు ఈ మొక్క ఎక్కడైనా సులభంగా దొరుకుతోంది. వాస్తు శాస్త్రం ప్రకారం దీన్ని "లక్కీ ప్లాంట్" అని కూడా పిలుస్తారు. ఆర్థిక సమస్యలు తగ్గి, సంపద పెరగాలని కోరుకునేవారు మనీ ప్లాంట్‌తో పాటు జెడ్ ప్లాంట్ ని ఇంట్లో పెంచడం చాలా మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఈ మొక్క తక్కువ సంరక్షణతో కూడా ఈజీగా పెరుగుతుంది. ఇంట్లో సానుకూల శక్తిని పెంచడంతో పాటు గాలిని శుద్ధి చేసి ఆక్సీజన్ ని పెంచుతుంది.
వాస్తు ప్రకారం ఆగ్నేయ దిశకు, లక్ష్మీ దేవికి సంబంధం ఉంది. అందుకే ఈ దిశలో జెడ్ మొక్కను పెడితే సంపద, శ్రేయస్సు పెరుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. జెడ్ ప్లాంట్ ని ఇంటి ప్రధాన ద్వారం లోపలి వైపు కూడా పెట్టుకోవచ్చు. అలాగే మనీ ప్లాంట్ ని కూడా ఆగ్నేయ దిశలో ఉంచడం అత్యంత శుభప్రదం. దానివల్ల సంపద, శాంతి, సంతోషం పెరుగుతాయని నమ్మకం. అలాగే మనీప్లాంట్ ని తూర్పు దిశలో కూడా పెట్టుకోవచ్చు. కానీ ఈశాన్య దిశలో అస్సలు పెట్టకూడదు. దానివల్ల ఆర్థిక సమస్యలు రావచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు.