Diwali : దీపావళికి ముందే ఇంట్లో చేయాల్సిన ముఖ్యమైన నాలుగు పనులు ఇవి..!

Published : Oct 09, 2025, 11:32 AM IST

Diwali : హిందూ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన పండగ దీపావళి. ఈ సంవత్సరం అక్టోబర్ 20వ తేదీన ఈ పండగ జరుపుకోనున్నారు. ఈ పండగ రోజున ప్రత్యేకంగా లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇలా చేయడం వల్ల సంపద పెరుగుతుందని నమ్ముతారు. 

PREV
15
Diwali 2025

దీపావళి పండగ వస్తూ వస్తూ... అందరి జీవితాల్లో వెలుగులు తీసుకువస్తుంది. ప్రతి ఒక్కరూ ఇష్టపడే పండగ ఇది. ఈ పండగ వేళ... లక్ష్మీ దేవి ఇంట్లో కి అడుగుపెడుతుంది అని నమ్ముతారు. మరి, లక్ష్మీదేవి కటాక్షం లభించాలి అంటే... దాని కోసం మనం కొన్ని పనులు చేయాలి. మరీ, ముఖ్యంగా దీపావళి రావడానికి ముందే... ఇంట్లోని కొన్ని వస్తువులను తొలగించాలి. అప్పుడే ఆ ఇంట్లో సంపద పెరుగుతుంది. మరి, వేటిని తొలగించాలో ఇప్పుడు చూద్దాం....

25
1.పగిలిన గాజు వస్తువులు...

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో పగిలిన గాజు వస్తువులు ఉంచుకోవడం అశుభకరం. వాటిని ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి, ఇంట్లో అద్దం పగిలినా,గాజు వస్తువులు పగిలినా.. వెంటనే వాటిని శుభ్రం చేసి, బయటపారేయండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి ఇంట్లో కి అడుగుపెడుతుందని నమ్ముతారు.

35
పాత చెప్పులు....

మీ ఇంట్లో పాత లేదా అరిగిపోయిన చెప్పులు ఉంటే, దీపావళి పండగ రావడానికి ముందే వాటిని తీసి బయట పారేయాలి. కేవలం పాత చెప్పులు మాత్రమే కాదు, పాత దుస్తులు కూడా ఇంట్లో ఉంచకూడదు. ఇవి ఇంట్లో దురదృష్టాన్ని పెంచే ప్రమాదం ఉంది. అంతేకాకుండా లక్ష్మీ దేవికి కోపం తెప్పిస్తుంది. కాబట్టి, ఈ దీపావళికి అలాంటవన్నీ వెంటనే తొలగించండి.

45
ఆగిపోయిన, పాడైపోయిన గడియారం....

అంతేకాదు.. ఆగిపోయిన, పాడైపోయిన గడియారం కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పెంచుతుంది. ఇది కెరీర్, ఆర్థిక సమస్యలను కలిగిస్తుంది. మీ ఇంట్లో ఇలాంటివి ఏవైనా ఉంటే, మీ అభివృద్ధికి ఆటంకం కలిగించొచ్చు. అందుకే.. వెంటనే అలాంటివి తీసి పడేయాలి. లేదా.. గడియారం రిపేర్ చేయడం మంచిది.

55
విరిగిపోయిన దేవుని విగ్రహాలు...

మీ పూజ గదిలో విరిగిన దేవుని విగ్రహం ఉంటే, దానిని ఇంట్లో ఉంచుకోకండి. మీ ఇంట్లో దేవుళ్ల విగ్రహాలను ఉంచుకోవడం కూడా అశుభంగా పరిగణిస్తారు. విగ్రహాలకు బదులు ఫోటోలు ఉంచడం ఉత్తమం. మీ ఇంట్లో ఆనందం , శ్రేయస్సు కావాలంటే, దీపావళికి ముందు అలాంటి విగ్రహాలను మీ ఇంటి నుండి తొలగించడం మంచిది. వాటిని ఏదైనా గుడిలో కానీ, పవిత్రమైన నీటిలో వదిలేయడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories