Chanakya Niti: చాణక్యుడి నీతి ప్రకారం... మనం వెళ్లిన ప్రతిచోటా మన తెలివితేటలు ప్రదర్శించకూడదు. కొందరి ముందు మన తెలివితేటలు చూపించడం అంత తెలివితక్కువతనం మరొకటి లేదు. ఆయన అలా ఎందుకు చెప్పాడో తెలుసా?
ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అందరి ముందు తెలివైనవారిగా కనిపించాలనే అనుకుంటారు. అందరూ తమను మెచ్చుకోవాలని , ప్రశంసించాలని అనుకుంటారు. వీలుకుదిరినప్పుడల్లా విజ్ఞాన ప్రదర్శన చేస్తూ ఉంటారు. కానీ, కొందరు మాత్రం ఏమీ తెలియని వారిలా, తెలివి తక్కువ వారిలా మాత్రమే కనిపించాలి అని చాణక్యుడు చెబుతున్నాడు. ఆయన ప్రకారం, ఎవరి ముందు.. మన జ్ఞానాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదో... ఇప్పుడు తెలుసుకుందాం...
24
1.శత్రువుల ముందు....
చాణక్యుడి ప్రకారం, మీ శత్రువుల ముందు మీ తెలివితేటలు ప్రదర్శించకూడదు. అది మీకే ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే, వారు మీ వ్యూహాలను అర్థం చేసుకొని, మీకు వ్యతిరేకంగా ప్రయోగించే ప్రమాదం ఉంది. కాబట్టి... శత్రువుల ముందు ఏమీ తెలియని వారిలా, మూర్ఖుడిలా ఉండాలి. అప్పుడు మీ వ్యూహం వారికి అర్థం కాదు. మీరు తెలివిగా విజయం సాధించవచ్చు.
34
2.అధికారంలో ఉన్నవారి ముందు....
ఉన్నత పదవిలో, చేతిలో పవర్ ఉన్నవారి ముందు కూడా మీరు తెలివైన వారిలా ప్రవర్తించకూడదు. దీని వల్ల.. వారు మీకు అహంకారం ఎక్కువ అని అనుకోవచ్చు. వారి కారణంగా మీరు ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంది. అందుకే... అలాంటి వారి ముందు మీ తెలివిని ప్రదర్శించకూడదు అని చాణక్యుడు చెబుతున్నాడు.
3.మీకు అనుకూలంగా లేని సమయంలో....
కొన్ని సందర్భాల్లో మాట్లాడటం, మీకు నష్టాన్ని కలిగించవచ్చు. చాణక్యుడి ప్రకారం – “మౌనం జ్ఞానుల ఆయుధం.” మీరు నిశ్శబ్దంగా ఉండడం ద్వారా పరిస్థితిని అర్థం చేసుకుని సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు.
దురాశ, మోసం చేసే వ్యక్తులు ఎప్పుడూ ఇతరులను వాడుకోవడానికి ప్రయత్నిస్తారు. వారి ముందు కూడా తెలివైన వారిలా కనిపించకూడదు. మీ తెలివితేటలను వారికి అనుకూలంగా మార్చుకొని, ఇతరులను మోసం చేసే అవకాశం ఉంది. అందుకే.... అలాంటి వారి ముందు మూర్ఖుడిలా ప్రవర్తించడం మేలు.