Thursday Remedies: తులసి ఆకులు విష్ణు మూర్తికి చాలా ప్రియమైనవి. వాటిని లక్ష్మీదేవికి కూడా సమర్పిస్తారు. గురువారం తులసి ఆకులను విష్ణువుకు ఎందుకు సమర్పించాలి? ఇలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?
వారంలో ప్రతి రోజుకీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఒక్కో రోజుని ఒక్కో దేవుడికి అంకితం చేశారు. ఈ క్రమంలో గురువారం కొందరు సాయిబాబాను పూజిస్తే.. కొందరు లక్ష్మీవారంగా భావిస్తారు. మరి కొందరు విష్ణుమూర్తిని పూజిస్తారు. ఈ గురువారం రోజున విష్ణుమూర్తిని చాలా ప్రత్యేకంగా పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షం లభిస్తుందని నమ్ముతారు. మరీ ముఖ్యంగా, ఈ రోజున తులసి ఆకులను ఆయనకు సమర్పించడం వల్ల జీవితంలో ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి.
25
తులసి ఆకులతో పూజిస్తే కలిగే ప్రయోజనాలు...
1.జీవితంలో సమస్యలన్నీ పరిష్కారమౌతాయి....
గురువారం తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేయాలి. ఈ రోజున పసుపు రంగులు దుస్తులు ధరించడం శుభప్రదంగా పరిగణిస్తారు. అప్పుడు, విష్ణువు ఆచారాల ప్రకారం పూజించి, హారతి ఇవ్వాలి. ఈ గురువారం రోజున పసుపు పూలు, తులసి పూలను కూడా సమర్పించాలి. అలాగే ‘ ఓం నమో భగవతే వాసుదావేయ’అనే మంత్రాన్ని 108 అనే మంత్రాన్ని జపించాలి. ఇలా ప్రతి వారం చేస్తే... జీవితంలో సమస్యలన్నీ పరిష్కారమౌతాయి.
35
2.సంపద పెరుగుతుంది....
మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుంటే, గురువారం విష్ణుమూర్తి తులసి ఆకులను సమర్పించాలి. ఇలా చేసే ముందు, గురువారం తెల్లవారు జామున స్నానం ఆచరించి...విష్ణుమూర్తికి పూజించి, ఈ తులసి ఆకులను పూజలో ఉంచాలి. తర్వాత సాయంత్రం పూజ చేసిన తర్వాత.. తరువాత, సాయంత్రం... ఆ తులసి ఆకులను శుభ్రమైన ఎరుపు లేదా పసుపు వస్త్రంలో కట్టి, వాటిని మీరు మీ డబ్బు దాచుకునే ప్రదేశంలో ఉంచాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే... ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి.
వ్యాపారంలో కలిసి రావాలని అనుకునేవారు ఈ రెమిడీ ప్రయత్నించాలి. జీవితంలో సక్సెస్ అవ్వాలన్నా, వ్యాపారాల్లో రాణించాలన్నా..గురువారం విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవి , విష్ణుమూర్తికి పసుపు, కుంకుమ తో పూజ చేయాలి. పూజ తర్వాత.. ఆ పసుపు , కుంకుమలను తీసుకొని వస్త్రంలో కట్టి.. మీ వ్యాపార స్థలంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల, వ్యాపార సమస్యలన్నీ తీరిపోతాయి.
55
4.నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే....
ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని మీరు ఫీలౌతూ ఉంటే.. ఈ రెమిడీ ప్రయత్నించాలి. గురువారం ఒక కుండ నీటిలో కొంత గంగా జలం, తులసి ఆకులను జోడించాలి. వాటిని పూజ గదిలో ఉంచి పూజ చేయాలి. తర్వాత ఆ నీటిని... ఇంట్లో, ఇంటి చుట్టూ చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. కుటుంబంలో సమస్యలు కూడా తీరిపోతాయి.