Friday Remedies: శాస్త్రాల ప్రకారం, ముఖ్యంగా శుక్రవారం రోజున ఈ రూపంలో లక్ష్మీదేవి ని పూజించడం వల్ల మీ ఇంట్లో, మీ జీవితంలో సానుకూల, సంతోషకరమైన వాతావరణం నెలకుంటుంది.
సనాతన ధర్మం ప్రకారం.. శుక్రవారాన్ని లక్ష్మీదేవిత ముడిపడి ఉంటుంది. లక్ష్మీ దేవి ఎనిమిది రూపాలలో ధనలక్ష్మీ అవతారం కూడా ఒకటి. ధనలక్ష్మీదేవి కటాక్షం ఉంటే..సంపద, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. మరి.. లక్ష్మీ దేవి మీ ఇంట అడుగుపెట్టాలి అంటే... శుక్రవారం పూట ఏం చేయాలి..? ఏం చేస్తే.. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం....
25
శుక్రవారం ఉపవాసం...
శాస్త్రాల ప్రకారం, ముఖ్యంగా శుక్రవారం రోజున ఈ రూపంలో లక్ష్మీదేవి ని పూజించడం వల్ల మీ ఇంట్లో, మీ జీవితంలో సానుకూల, సంతోషకరమైన వాతావరణం నెలకుంటుంది. 21 శుక్రవారాలు ఉపవాసం ఉండటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే... 21 శుక్రవారాలు ఉపవాసం ఉండటం సాధ్యం కాకపోతే.. కొన్ని పనులు చేసినా.. లక్ష్మీ కటాక్షం లభిస్తుంది.
35
తామర గింజలతో దండ...
తామర పూలను సాధారణంగా లక్ష్మీదేవి పూజలో ఉపయోగిస్తూనే ఉంటారు. ఈ తామర గింజలతో తయారు చేసిన గింజలతో దండ చేసి లక్ష్మీదేవికి సమర్పించడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అంతేకాదు... ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటే అవి తీరతాయి. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి.
గవ్వలు...
గవ్వలు, ఆల్ చిప్పలు సముద్రంలో లభిస్తాయి. పురాణాల ప్రకారం.. లక్ష్మీదేవి సముద్రంలోనే పుట్టింది అని కూడా నమ్ముతారు. శుక్రవారం రోజున మీరు ఈ గవ్వలు, ఆల్ చిప్పలను లక్ష్మీదేవికి సమర్పించాలి. ఇవంటే.. లక్ష్మీదేవికి చాలా ఇష్టం. వీటిని సమర్పించడం వల్ల.. ఆ తల్లి అనుగ్రహం లభించి.. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
విష్ణుమూర్తి దగ్గర శంఖం ఉంటుంది. కాబట్టి... ఈ శంఖం లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనదిగా పరిగణిస్తారు. మీరు శుక్రవారం రోజున మీ ఇంటి పూజ గదిలో ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల మీ డబ్బు కొరత తీరుతుంది. ఆర్థికంగా మంచి స్థాయికి వెళతారు. ఇంట్లో సానుకూల శక్తి కూడా పెరుగుతుంది.
వేణువు
విష్ణువుకి ఇష్టమైన వాయిద్యం, లక్ష్మీ దేవికి కూడా చాలా ప్రియమైనది. మీరు మీ ఇంటి ఆలయంలో వేణువు వెదురును ఉంచి శుక్రవారం దానిని పూజించవచ్చు ఎందుకంటే ఈ పరిహారం మీ ఇంటి నుండి పేదరికాన్ని తొలగిస్తుంది. సంపదను పెంచుతుంది.
55
ఆవుకు ఆహారం తినిపించడం...
హిందూ మతంలో ప్రతిరోజూ ఆవులకు ఆహారం తినిపించడం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ముఖ్యంగా శుక్రవారం నాడు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి.. మీ సంపద పెరిగేలా చేస్తుంది.
మనీ ప్లాంట్ పరిహారం
హిందూ మతం నమ్మకాల ప్రకారం.. ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకున్నా కూడా చాలా మంచి జరుగుతుంది. వేరొకరి ఇంటి నుంచి దొంగతనం తెచ్చి మన ఇంట్లో పెట్టుకుంటే.. మరింత ఎక్కువ మంచి జరుగుతుందని నమ్ముతారు.
కుబేర యంత్ర పరిహారం
పురాణం ప్రకారం, కుబేరుడు సంపద కు దేవతగా పరిగణిస్తారు.. ఆర్థిక లాభాల కోసం మీరు కుబేరుడిని లేదా లక్ష్మీ దేవితో పాటు 'కుబేర యంత్రాన్ని' పూజించాలి. ఇలా చేయడం వల్ల కూడా మీ డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి.