Brass Pooja Items: ఇత్తడి పూజా సామాగ్రిని ఇలా శుభ్రం చేస్తే.... కొత్త వాటిలా మెరిసిపోతాయి..!

Published : Sep 17, 2025, 01:31 PM IST

Brass Pooja Items: పూజకు వాడే దీపాలు, గంట ఇలా చాలా వాటిని ఇత్తడి సామాన్లు వాడుతూ ఉంటారు. అయితే... వీటిని వాడుతున్న ప్రతిసారీ.. వీటి మెరుపు తగ్గుతుంది.   అవి ఎప్పుడూ కొత్త వాటిలా మెరుస్తూ కనిపించాలి అంటే.. ఈ చిట్కాలు ఫాలో అయితే చాలు.

PREV
14
Brass Iteams

దాదాపు ప్రతి భారతీయ ఇంట్లో ఇత్తడి పూజా వస్తువులు ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. పూజకు వాడే దీపాలు, గంట ఇలా చాలా వాటిని ఇత్తడి సామాన్లు వాడుతూ ఉంటారు. అయితే... వీటిని వాడుతున్న ప్రతిసారీ.. వీటి మెరుపు తగ్గుతుంది. దీంతో అవి పాత వస్తువుల్లా కనపడతాయి. అలా కాకుండా.. అవి ఎప్పుడూ కొత్త వాటిలా మెరుస్తూ కనిపించాలి అంటే.. కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చాలు. వేటితో క్లీన్ చేస్తే.. పూజ సామాన్లు కొత్త వాటిలా మెరుస్తూ కనపడతాయో ఇప్పుడు చూద్దాం...

24
1.ఎర్ర మట్టి, ఉప్పు, నిమ్మరసం...

మీరు ఎర్ర మట్టి, ఉప్పు, నిమ్మరసం ఈ మూడింటిని కలిపి ఇత్తడి వస్తువులను కొత్త వాటిలా మెరిసేలా చేయవచ్చు. ఒక ప్లేట్ లో మీరు ఎర్రమట్టి, ఉప్పు, నిమ్మరసం కలిసి ఒక పేస్టులాగా చేయాలి. కావాలంటే కొద్దిగా నీరు కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ఇత్తడి వస్తువులపై పూయాలి. తర్వాత స్క్రబ్ చేయాలి. బ్రష్ తో రుద్ది.. తర్వాత నీటితో కడిగితే.. కొత్త వాటిలా మెరుస్తూ కనపడతాయి.

34
2. నిమ్మకాయ, ఉప్పు...

ఇత్తడి వస్తువులను శుభ్రం చేయడానికి నిమ్మకాయ, ఉప్పు కూడా చాలా బాగా పని చేస్తాయి. నిమ్మకాయను ముక్కలుగా కట్ చేసి... దానికి ఉప్పు అద్దాలి. ఉప్పు అద్దిన నిమ్మకాయను డైరెక్ట్ గా ఇత్తడి వస్తువులపై రుద్దాలి. గట్టిగా రుద్దిన తర్వాత.... గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఆ తర్వాత మృదువైన వస్త్రంతో శుభ్రం చేయాలి.

44
3. చింత పండు...

ఇది చాలా పాత పద్దతి. చింతపండు గుజ్జుతో ఇత్తడి వస్తువులను కొత్త వాటిలా మెరిసేలా చేయవచ్చు.చింతపండు గుజ్జును గోరువెచ్చని నీటిలో నానబెట్టి, ఇత్తడి వస్తువులపై సున్నితంగా రుద్దండి. పది నిమిషాలు అలాగే వదిలేసి.. ఆ తర్వాత... నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఏదైనా క్లాత్ తో తుడిచి భద్రపరుచుకుంటే సరిపోతుంది. ఈ మూడు విధానాల ద్వారా మీ ఇంట్లో పూజా సామాగ్రిని మీరు కొత్త వాటిలా మెరిసేలా చేయవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories