Salt Remedies: ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగినప్పుడు రకరకాల సమస్యలు మొదలవుతాయి. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, గొడవలు వస్తుంటాయి. ఈ నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టడానికి వంటగదిలో ఉండే ఉప్పు చాలు. ఉప్పును ఎలా వాడితే ఇంట్లో సంపద, సంతోషం పెరుగుతాయో చూద్దాం.
కిచెన్ లో ఉపయోగించే అతి ముఖ్యమైన పదార్థాల్లో ఉప్పు ముందు వరుసలో ఉంటుంది. ఉప్పు లేని కూర తినడం చాలా కష్టం. అయితే ఉప్పు వంటలకు రుచిని పెంచడమే కాదు. చాలా రకాలుగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు వాస్తు నిపుణులు. ముఖ్యంగా వాస్తు శాస్త్రంలో ఉప్పునకు చాలా ప్రాధాన్యం ఉందట. కాస్త ఉప్పుతో చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందట. ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచి, శాంతి, ఆర్థిక వృద్ధికి సహాయపడుతుందట. మరి ఉప్పును ఎలా ఉపయోగించాలో తెలుసుకుందామా..
26
పనుల్లో విజయం
వాస్తు శాస్త్రం ప్రకారం.. మీ దురదృష్టం.. అదృష్టంగా మారాలన్నా, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలన్నా జేబులో ఉప్పు పెట్టుకోవడం మంచిదట. ఒక కవర్‌లో లేదా చిన్న క్లాత్ లో ఉప్పును కట్టి జేబులో పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని నమ్మకం. అంతేకాదు చేపట్టిన పనుల్లో విజయం దక్కుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
36
ఈ తప్పు చేయవద్దు
చాలా ఇళ్లల్లో ఉప్పు డబ్బా ఖాళీగా ఉంటుంది. కానీ అలా ఖాళీగా ఉంచడం అశుభం. ఉప్పు డబ్బా ఎప్పుడూ నిండుగా ఉండాలి. మీరు శుక్రవారం రోజు ఉప్పు డబ్బాను నింపితే ఇంట్లో సంపద, శ్రేయస్సు పెరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలంటే ఇంటి ప్రధాన ద్వారం ముఖ్యం. గుమ్మం శుభ్రంగా ఉంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ప్రతి శనివారం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కొద్దిగా ఉప్పు చల్లాలి. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాగే జీతం వచ్చిన రోజు డబ్బులున్న పర్సు దగ్గర లేదా కార్డుల దగ్గర కొంచెం ఉప్పు పెట్టడం మంచిదట. ఇది డబ్బును ఆకర్షించి, సంపదను పెంచుతుందని నమ్మకం.
56
మనశ్శాంతి కోసం ఉప్పు నీరు
వాస్తు నిపుణుల ప్రకారం.. మీ మానసిక ప్రశాంతత కోసం, కష్టాలు దూరం కావడానికి ఉప్పు నీటి పరిహారం పాటించవచ్చు. ముందుగా చేతిలో కొంచెం ఉప్పు పట్టుకొని.. మనసులోని బాధలు, సమస్యలను చెప్పుకోవాలి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవాలి. అలా చేయడం ద్వారా మనసులోని భారం తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
66
ఇంటి మూలలో ఉప్పు
ఒక గాజు గిన్నె తీసుకుని అందులో ఉప్పు వేసి ఇంటి మూలలో పెట్టాలి. ఇది ఇంటిని శుద్ధి చేస్తుంది. నెగెటివ్ ఎనర్జీని దూరం చేసి, పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. అయితే, గిన్నెలోని ఉప్పును అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి. అలాగే ఒక బకెట్ నీటిలో కొంచెం ఉప్పు వేసి, ఆ నీటితో ఇల్లు తుడిసినా మంచి ఫలితాలు ఉంటాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.