హిందూ మతంలో చాలా శాస్త్రాలు, నమ్మకాలు ఉన్నాయి. టెక్నాలజీ పెరుగుతున్నా.. ఇప్పటికీ కొన్ని నమ్మకాలను బలంగా నమ్మేవారు చాలా మంది ఉన్నారు. మరీ ముఖ్యంగా ఏదైనా ముఖ్యమైన పని మొదలుపెట్టేటప్పుడు మంచి సమయం, మంచి రోజు చూసుకుంటారు. ఇక.. ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్తున్నప్పుడు శకునం చూసుకుంటారు. మంచి శకునం ఎదురైతే... ఆ పని ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతుందని నమ్ముతారు. చెడు శకునం ఎదురైతే ఆ పని జరగదనే భావన ఉంటుంది. మరి.. శవం కానీ, బిచ్చగాడు కానీ ఎదురైతే ఏం జరుగుతుంది? మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా?
శవం ఎదురైతే...
శకునాల ప్రకారం, మీరు పనిమీద బయటకు వెళ్తున్నప్పుడు ఎవరైనా చనిపోయిన వ్యక్తిని ఊరేగింపు కనిపిస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది చాలా మంచి శుభ శకునం. పనిలో కచ్చితంగా విజయం సాధిస్తారు. మీ పనిలో రెట్టింపు లాభాలు పొందుతారు. అయితే, మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొని ముందుకు సాగితే.. మీ పని మరింత సులభం అవుతుంది. అంతేకాదు.. ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి బయలుదేరినప్పుడు శంఖం లేదా గంటల శబ్దం వినపడటం కూడా చాలా శుభప్రదంగా పరిగణిస్తారు.