ఇల్లు, ఇంటి పరిసరాలు వాస్తు ప్రకారం ఉంటే ఇంట్లో శుభం జరుగుతుందని చాలామంది నమ్ముతారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో కొన్ని మొక్కలు పెంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరగడంతోపాటు డబ్బుకు లోటుండదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఆ మొక్కలేంటో ఇక్కడ చూద్దాం.
వాస్తు ప్రకారం ఇంట్లో కచ్చితంగా పెంచాల్సిన మొక్కలు
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కోరుకునేది స్థిరమైన ఆదాయం, ప్రశాంతమైన జీవితం. దానికోసం కొందరు ఎంత కష్టపడి పనిచేసినా, కొన్నిసార్లు డబ్బు నిలవదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో కొన్ని మొక్కలు పెంచడం ద్వారా మన జీవితంలో మంచి మార్పులు వస్తాయని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఆ మొక్కలు డబ్బు రాకను పెంచి, పాజిటివ్ ఎనర్జీని నింపుతాయని చెబుతున్నారు. ఆ మొక్కలేంటో తెలుసుకుందామా...
25
లక్కీ బాంబూ
లక్కీ బాంబూ.. మంచి అదృష్టాన్ని, కొత్త అవకాశాలను ఆకర్షిస్తుందని నమ్మకం. దీన్ని పెంచడం కూడా చాలా సులభం. ఇంట్లో హాల్‌లో లేదా ఆఫీస్ టేబుల్‌పై పెడితే, అభివృద్ధి, ఆర్థిక వృద్ధి కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
మల్లె
మల్లెపూలు వాటి సువాసనతో మనసును ప్రశాంతపరుస్తాయి. వాస్తు ప్రకారం మల్లె చెట్టు డబ్బును ఆకర్షించే శక్తిని కలిగి ఉంటుంది. అయితే, దీన్ని పెంచడానికి కొంచెం శ్రద్ధ అవసరం. మంచి వెలుతురు, సరైన నీరు అందిస్తే బాగా పెరుగుతుంది.
35
తులసి
హిందూ సంస్కృతిలో తులసి మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది నెగిటివ్ ఎనర్జీని తొలగించి, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. తులసిని కిటికీ దగ్గర లేదా ఎక్కువ వెలుతురు వచ్చే చోట పెట్టడం మంచిది. ఇది కుటుంబంలో శాంతిని, ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుందని నమ్మకం.
స్నేక్ ప్లాంట్
స్నేక్ ప్లాంట్‌కు గాలిని శుద్ధి చేసే సామర్థ్యం ఉంది. వాస్తు ప్రకారం, ఇది నెగిటివ్ ఎనర్జీని అడ్డుకుంటుంది. ఇంటి మూలల్లో లేదా ప్రవేశ ద్వారం దగ్గర పెడితే మంచి శక్తి నిలిచి ఉంటుంది.
మనీ ప్లాంట్ పేరులోనే దాని ప్రత్యేకత తెలుస్తుంది. ఇది ఇంట్లో డబ్బు రాకను పెంచే మొక్కగా చాలా ఫేమస్. వాస్తు ప్రకారం, దీన్ని ఇంటి ఆగ్నేయ మూలలో పెట్టడం మంచి ఫలితాలను ఇస్తుంది. అంతేకాదు, ఇది గాలిని కూడా శుద్ధి చేస్తుంది.
పీస్ లిల్లీ
పీస్ లిల్లీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించి, కుటుంబంలో సామరస్యాన్ని పెంచుతుంది. పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించి, జీవితంలో సమతుల్యతను తీసుకురావడానికి సహాయపడుతుంది.
55
జెడ్ ప్లాంట్
జెడ్ ప్లాంట్ చిన్న, మందపాటి ఆకులను కలిగి ఉంటుంది. ఇది ఆర్థిక వృద్ధికి, వ్యాపార పురోగతికి సహాయపడుతుందని నమ్మకం. ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర పెడితే కొత్త ఆదాయ అవకాశాలు పెరుగుతాయి.
ఇంట్లో మొక్కలు పెంచడం కేవలం అలంకరణ మాత్రమే కాదు, అది జీవనశైలిని మార్చే ఒక మార్గం కూడా. వాస్తు శాస్త్రం చెప్పిన ఈ మొక్కలను సరైన స్థలంలో పెట్టి, జాగ్రత్తగా చూసుకుంటే.. డబ్బు రాక, అదృష్టం, మనశ్శాంతి నెమ్మదిగా పెరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు.