మానసిక స్పష్టతను మెరుగుపరుస్తుంది:
అగరబత్తీల ఆహ్లాదకరమైన వాసన మనస్సును ప్రశాంతపరుస్తుంది. ఆందోళనను తగ్గిస్తుంది. కర్పూరం, కుంకుమపువ్వు , తులసి వంటి సుగంధాలు విశ్రాంతిని ప్రేరేపిస్తాయి, దృష్టిని మెరుగుపరుస్తాయి. ధ్యానంలో సహాయపడతాయి. కొద్ది రోజుల గ్యాప్ ఇచ్చి, మళ్లీ ఈ అగరబత్తీలను ఇంట్లో వెలిగిస్తే.. మీకు ఉన్న ఒత్తిడి తగ్గిపోతుంది. హాయి ఫీలింగ్ కలుగుతుంది.
కీటకాలు, దోమలను తరిమి కొడతాయి..
సాధారణంగా అగరబత్తీల తయారీలో ఎక్కువగా నిమ్మకాయ, యూకలిప్టస్ , వేప ఉంటాయి, ఇవి సహజ కీటక వికర్షకాలుగా పనిచేస్తాయి. ధూపద్రవ్యాల నుండి వచ్చే పొగ హానికరమైన రసాయనాలు లేకుండా దోమలు, ఈగలు , ఇతర కీటకాలను తిప్పికొడుతుంది, ఇది రసాయన వికర్షకాలకు సురక్షితమైన ప్రత్యామ్నాయంగా మారుతుంది.