ప్రతి ఇంటి ముందు తులసి మొక్కల కచ్చితంగా ఉంటుంది. ఇంటి ముందు తులసి మొక్క ఉంచితే దుష్ట శక్తులు దూరమవుతాయని వేద పండితులు చెబుతున్నారు.
నేచర్ మనకు ఎన్నో ఔషధ మొక్కలను ఇచ్చింది. అందులో ఒకటి తులసి. దీన్ని ఇంటి ముందు ఉంచితే గాలి శుద్ధి అవుతుంది.
తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఈ మొక్క గాలి పీల్చినా ఆరోగ్యానికి మంచిదే. అందుకే ఇంటి ముందు తులసి మొక్క ఉంచితే రోగాలు దరిచేరవు.
ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఒత్తిడి కామన్ అయిపోయింది. తులసి మొక్క ఇంటి ముందు ఉంటే మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క ఇంటి యజమాని ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది.
తులసి మొక్క సాక్షాత్తు అమ్మవారి రూపమని వేదాలు చెబుతున్నాయి. తులసి మొక్క అదృష్టాన్ని పెంచుతుందని స్త్రీలు నిత్యం పూజ చేస్తారు.