Vastu Tips: ఇంట్లో వాషింగ్ మిషన్ ను ఆ దిక్కుల్లో అస్సలు పెట్టొద్దు. చెడు ఫలితాలు కలుగుతాయి

Published : May 03, 2025, 11:09 AM IST

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వాషింగ్ మిషన్ పెట్టే స్థానం కూడా మీకు శుభ, అశుభ ఫలితాలను కలిగిస్తుందని మీకు తెలుసా? దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఏ స్థానంలో వాషింగ్ మిషన్ పెడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 

PREV
15
Vastu Tips: ఇంట్లో వాషింగ్ మిషన్ ను ఆ దిక్కుల్లో అస్సలు పెట్టొద్దు. చెడు ఫలితాలు కలుగుతాయి

వాషింగ్ మిషన్ మురికిగా ఉన్న బట్టలను శుభ్రం చేస్తుంది కాబట్టి వాస్తు శాస్త్ర ప్రకారం ఈ పరికరాన్ని ముట్టుకోకూడని వస్తువుగానే చూస్తారు. అందుకే దీన్ని ఇంటి బయట, వాష్ రూమ్ ఏరియాలో ఉంచుతారు. అయితే ప్రత్యేకమైన దిక్కులో వాషింగ్ మిషన్ పెట్టడం కూడా చాలా అవసరమట. వాస్తు శాస్త్ర ప్రకారం వాషింగ్ మిషన్ తరచూ ముట్టుకోకూడని వస్తువు కాబట్టి ఏ దిక్కులో పెడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. 
 

25

వాస్తు శాస్త్రంలో ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితే మంచి ఫలితాలు కలుగుతాయి. వస్తువులు సరైన దిశలో, సరైన స్థానంలో లేనప్పుడు ఆ ఇంటిలో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇది ఇంట్లో ఉండే వ్యక్తులపై ప్రభావం చూపుతుంది. దీంతో వారి ఆలోచనలు సక్రమంగా లేక చేపట్టిన పనులు పెయిల్ అవుతుంటాయి. 

35

వాస్తు గురించి సరైన అవగాహన లేక ఇంట్లో వాషింగ్ మెషీన్ ను కూడా చాలామంది తప్పు దిశలో పెడతారు. ఎక్కడ, ఏ దిశలో పెట్టాలో చాలా మందికి తెలియదు. ఇది ఇంటి వాస్తుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం వాషింగ్ మెషీన్‌ను ఆగ్నేయ దిశలో ఉంచడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. ఇది ప్రతికూల శక్తిని కూడా  తొలగిస్తుంది.

45

వాస్తు శాస్త్ర ప్రకారం ఎలాంటి యంత్ర పరికరాలనైనా ఆగ్నేయ దిశలోనే ఉంచాలి. అప్పుడే అవి బాగా పనిచేస్తాయి. దీంతో ఇంట్లో కూడా చికాకులు ఉండవు. 

వాయవ్య దిశ కూడా యంత్రాలు పెట్టడానికి అనుకూలమే. ఈ రెండు దిశల్లో వాషింగ్ మిషన్ లాంటి వస్తువులు  పెట్టడం వల్ల అనవసర ఆర్ధిక భారాలు తగ్గుతాయి. ఆరోగ్య సంబంధ సమస్యలు తక్కువగా ఉంటాయి. ఇంటిలోకి పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది.

55

వాచింగ్ మిషన్ ఈ దిశల్లో అస్సలు పెట్టొద్దు

1. ఈశాన్యం (North-East)లో వాషింగ్ మిషన్ పెట్టకూడదు. ఎందుకంటే ఇది దేవతల స్థానం. ఇది శుభ్రతకు సంబంధించిన స్థానం. వాస్తు శాస్త్ర ప్రకారం ఇక్కడ మురికిగా ఉండే వస్తువులు, పరికరాలు ఉంచకూడదు.

2. బ్రహ్మస్థానంలో వాషింగ్ మిషన్ లాంటి వస్తువులు పెట్టకూడదు. బ్రహ్మస్థానం అంటే ఇంటి మధ్య భాగం. ఇంటి మధ్యలో ఏ విధమైన భారమైన వస్తువులు లేదా పనివస్తువులు పెట్టకూడదు. ఇది ఇంటిలోకి శక్తి ప్రవాహాన్ని నిరోధిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories