చర్లపల్లి-తిరుచిరాపల్లి ఎక్స్ ప్రెస్..
17077 నంబర్ గల చర్లపల్లి – తిరుచిరాపల్లి ఎక్స్‌ప్రెస్ ప్రతి మంగళవారం సాయంత్రం 5.20 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు మీదుగా ప్రయాణించి, మరుసటి రోజు అంటే బుధవారం ఉదయం 8.50 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఏడుకొండలస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ కొత్త వీక్లీ సర్వీసు ఆ ఇబ్బందులన్నింటినీ దూరం చేస్తుంది.
ఆ తర్వాత ఈ రైలు రేణిగుంట, చిత్తూరు, కాట్పాడి, అరుణాచలం (తిరువణ్ణామలై) మీదుగా వెళ్తుంది. అరుణాచలేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు కూడా ఈ కనెక్టివిటీ ఉపయోగపడుతుంది. అక్కడి నుంచి విల్లుపురం, వృద్ధాచలం, అరియలూర్, శ్రీరంగం మీదుగా బుధవారం సాయంత్రం 6.45 గంటలకు తిరుచిరాపల్లి చేరుకుంటుంది. అంటే శ్రీరంగం శ్రీరంగనాథస్వామిని కూడా దర్శించుకోవచ్చు.