Spiritual : ఈ మాంసం తింటే అంతే సంగతి.. 7 తరాలకు శాపమే, వంశం మొత్తం నాశనమే

Published : May 29, 2026, 05:05 PM IST

కోడి, మేక మాంసం చాలామంది ఇష్టంగా తింటారు.. మాంసాహారం అనేది అనాదిగా వస్తున్న అహారపు అలవాటు. అయితే విదేశీ రుచుల మాయలో కొందరు పాము మాంసం కూాడా తింటున్నారు.. హిందూ సంప్రదాయాల ప్రకారం ఇది ఎంత ప్రమాదకరమో తెలుసా..?  

PREV
15
పాాము మాంసం తినడం ఇంత పాపమా..?

ప్రకృతికి, మనిషికి మధ్య విడదీయరాని బంధం ఉందని హిందూ మతం చెబుతుంది. అందుకే హిందువులు ప్రకృతిని దైవస్వరూపంగా భావిస్తారు. అంతేకాదు కొన్ని జంతువులు ప్రమాదకరం అయినప్పటికీ దైవంగా పూజిస్తారు. ఇలా పూజించే జంతువుల్లో పాములు కూడా ఒకటి… హిందూ పురాణాల్లో వీటికి ప్రత్యేక స్థానం ఉంది. పరమశివుడు మెడలో ఆభరణంగా, విష్ణుమూర్తి శయనపాన్పుగా ఉండేది పాములేే… ఇలా దేవుళ్లవద్ద ఉండే పాములను నాగదేవతలుగా భావిస్తుంటారు. 

అయితే పాముకు హాని చెయడంవల్ల నాగదోషం కలుగుతుందని అంటారు. అలాంటిది ఇటీవల కాలంలో కొందరు పాము మాంసం తింటున్నారు. మరి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పాము మాంసం తినడం వల్ల కలిగే తీవ్రమైన దోషాలేమిటి..? ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయి..? అనేది తెలుసుకుందాం.  

25
నాగ దోషంతో కలిగే పరిణామాలు

ఆధునిక జీవనశైలి, విదేశీ సంస్కృతులపై మోజుతో కొందరు తెలియక తప్పులు చేస్తున్నారు. ఈ తప్పుల ప్రభావం వారిపై మాత్రమే కాకుండా మొత్తం వంశంపై పడుతుంది. ముఖ్యంగా పాము మాంసం తినేవారికి ఏడు తరాల వరకు తీవ్రమైన నాగదోషం కలుగుతుందని జ్యోతిష్కులు చెబుతున్నారు.

జ్యోతిష్య నమ్మకాల ప్రకారం… పామును చంపడం లేదా దాని మాంసం తినడం వల్ల నాగదోషం లేదా సర్ప దోషం అనే తీవ్రమైన శాపం తగులుతుంది. ఈ శాపం ఆ వ్యక్తితోనే పోకుండా ఏడు తరాల వరకు వెంటాడుతుందని నమ్ముతారు. ఈ దోషం వల్ల కుటుంబంలో సమస్యలు, సంతానలేమి, వివాహ ఆటంకాలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వంటివి ఎదురవుతాయి.

35
వంశం అంతరించిపోతుందా..?

పామును చంపడం లేదా దాని మాంసం తినడం వల్ల కలిగే దోషంతో సంతానలేమి సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు వంశం అంతరించిపోయే శాపం కూడా కలుగుతుంది. నాగదోషం ఉన్న కుటుంబాల్లోని యువతకు పెళ్లిళ్లు కావడం కష్టమవుతుంది. ఒకవేళ పెళ్లి జరిగినా వారికి పిల్లలు పుట్టక వంశం ఆగిపోయే ప్రమాదం ఉంది.

ఒకవేళ పిల్లలు పుట్టినా వారికి మానసిక లేదా శారీరక లోపాలు ఉండవచ్చు. శాపానికి గురైన కుటుంబంలో పుట్టే పిల్లలు, మనవళ్లు, మునిమనవళ్లు పుట్టుకతోనే మానసిక లేదా శారీరక వైకల్యాలతో బాధపడవచ్చు. కంటిచూపు లేకపోవడం, నడవలేకపోవడం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.

45
పాములను హింసించడం మహాపాపం

నాగదోశం కలిగినవారికి దీర్ఘకాలిక వ్యాధులు, వంశపారంపర్య రోగాలు, చర్మ వ్యాధులు, రక్తం, నరాల సంబంధిత సమస్యలు వస్తాయి. ఎంత ఆధునిక వైద్యం చేయించినా ఈ వ్యాధులు పూర్తిగా నయం కావు. అలాగే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, పేదరికం కూడా వారిని వెంటాడతాయి. కోటీశ్వరులైనా, సంపాదించిన ఆస్తి మొత్తం కోల్పోతారు. తర్వాతి తరాల వారికి పూట గడవని పరిస్థితి వస్తుందని పెద్దలు చెబుతుంటారు. 

హిందూ ధర్మంలో పాములను రాహు, కేతు గ్రహాల రూపాలుగా భావిస్తారు. శివుడు, విష్ణువు పూజలతో కూడా వీటికి సంబంధం ఉంది. పాములకు హాని చేయడం అంటే ప్రకృతి, ఆధ్యాత్మిక నియమాలను ఉల్లంఘించడమే. పాము మాంసం తినడం హిందూ మతంలో నీచమైన చర్యగా పరిగణిస్తారు. పాములను హింసించడం, దయ లేకుండా చంపడం మనిషి చేసే మహా పాపాలలో ఒకటిగా భావిస్తారు.

55
నాగదోషాపినికి తగిన పూజలు చేయండి..

ఈ రోజుల్లో కొందరు పాము మాంసం తింటున్నారు. కానీ జ్యోతిష్యుల హెచ్చరిక ప్రకారం.. ఇది తీవ్రమైన నాగదోషానికి దారితీస్తుంది. ఈ దోషం ఏడు తరాల వరకు వెంటాడుతుంది. తెలిసి లేదా తెలియక చేసిన ఈ తప్పులకు సరైన ఆధ్యాత్మిక సలహా తీసుకుని, పరిహార పూజలు చేయడం అవసరం. ఏ జీవిని, ముఖ్యంగా పాములను హింసించకుండా ఉండటమే ఉత్తమ మార్గం. 

(గమనిక: ఈ కథనంలోని సమాచారం జ్యోతిష్యులు, మత గ్రంథాలు, పంచాంగం ఆధారంగా రాసింది. ఏసియానెట్ తెలుగు దీన్ని ధృవీకరించడం లేదు. సమాచారాన్ని అందించడమే మా ఉద్దేశం. దీని కచ్చితత్వం, విశ్వసనీయతకు ఏసియానెట్ తెలుగు బాధ్యత వహించదు)

Read more Photos on
click me!

Recommended Stories