Camphor: కర్పూరం నీటిలో కరిగించి తాగితే ఇన్ని ప్రయోజనాలా..? అస్సలు ఊహించరు..!

Published : Jun 11, 2025, 03:43 PM IST

ఆయుర్వేదం ప్రకారం, కర్పూరం నీరు తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా బాగా సహాయపడుతుంది.

PREV
16
కర్పూరాన్ని ఎలా వాడాలో తెలుసా?

కర్పూరం అనేది శతాబ్దాలుగా సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించే సహజ పదార్థం. సాధారణంగా మనం ఇంట్లో పూజలు చేసినప్పుడు కర్పూరాన్ని వెలిగించి దీపారాధన చేస్తూ ఉంటాం. కర్పూరం సువాసన చాలా ఆహ్లాదకరమైన భావన కలిగిస్తుంది. అందుకే చాలా మంది ఈ కర్పూరాన్ని తమ దుస్తుల కబోర్డ్ లో కూడా ఉంచుతూ ఉంటారు. ఈ కర్పూరాన్ని కొన్ని రకాల ప్రసాదాలు తయారు చేసే సమయంలో కూడా వాడుతూ ఉంటారు. ఈ కర్పూరం వేయడం వల్ల ఆ ప్రసాదం రుచి కూడా డబుల్ అవుతుంది.

26
ఆయుర్వేదం ఏం చెబుతుంది..

ఈ కర్పూరాన్ని అలా ఆహారంలో కాకుండా.. నీటిలో కలిపి తీసుకుంటే ఏమౌతుందో తెలుసా? ఆయుర్వేదం ప్రకారం, కర్పూరం నీరు తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా బాగా సహాయపడుతుంది. మరి, ఈ కర్పూరం వాటర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం...

36
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

కర్పూర నీరు జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గ్యాస్, కడుపు,మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కర్పూరంలోని శోథ నిరోధక లక్షణాలు కడుపు మంటను తగ్గిస్తాయి. ప్రతి ఉదయం కర్పూర నీరు తాగడం వల్ల ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది. కానీ దీనిని మితంగా తీసుకోవాలి.

46
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:

కర్పూరం యాంటీమైక్రోబయల్ ,యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది వ్యాధికారక క్రిములకు వ్యతిరేకంగా శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోజూ కొద్ది మొత్తంలో కర్పూరం నీరు తాగడం వల్ల జలుబు, దగ్గు ,జ్వరం వంటి అంటు వ్యాధుల నుండి రక్షణ లభిస్తుంది.

ఒత్తిడిని తగ్గిస్తుంది:

కర్పూరం వాసన ఒత్తిడి ,ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మనసుకు ప్రశాంతతను ఇస్తుంది.మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. కర్పూరం నీరు తాగడం నాడీ వ్యవస్థను స్థిరీకరించడానికి,మీరు మనశ్శాంతిని పొందడానికి సహాయపడుతుంది.

56
శరీర వేడిని సమతుల్యం చేస్తుంది:

కర్పూరం నీరు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా, వేసవిలో దీనిని తాగడం వల్ల శరీర వేడిని తగ్గిస్తుంది.మీ దాహం తీరుతుంది. ఇది శరీరం నుండి అంతర్గత వేడిని తొలగిస్తుంది.చర్మ సమస్యలను కూడా నివారిస్తుంది.

రక్తాన్ని శుద్ధి చేస్తుంది:

కర్పూరం రక్త శుద్ధి చేసే లక్షణాలను కలిగి ఉంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.టాక్సిన్స్ బయటకు పంపడంలో సహాయపడుతుంది.

ప్రతిరోజూ కర్పూరం నీరు తాగడం వల్ల చర్మ సమస్యలు, ఆర్థరైటిస్ ,రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

66
చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది:

కర్పూరం నీరు గాలిలో వ్యాపించే వ్యాధికారకాలను చంపే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది, ఇది నోటి ,దంత పరిశుభ్రతను మెరుగుపరుస్తుంది. ఇంకా, ఇది మొటిమలు, దద్దుర్లు,చికాకు వంటి చర్మ సమస్యలను తగ్గిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories