డేటింగ్ విషయంలో కొందరు చాలా వీక్ ఉంటారు. వీరికి అస్సలు డేటింగ్ అంటే.. ఎలా నడుచుకోవాలో తెలియదు. కనీసం ఆ ఆలోచనలే ఉండదు. ఇలాంటి వారు ఎవరితోనైనా డేటింగ్ కు వెడితే.. అది చివరికి అభాసుపాలవ్వడంతోనే ముగుస్తుంది. అలాంటి వ్యక్తితో డేటింగ్ చాలా నిరుత్సాహాన్ని కలిగిస్తుంది.
అలాంటి వారికి దూరంగా ఉండాలనుకునే ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. మరి వారిని గుర్తించడం ఎలా? అంటే వారి రాశిని బట్టి అలాంటి వారిమీద ఓ అంచనా వేసుకోవచ్చు అంటున్నారు.. జ్యోతిష్యశాస్త్ర నిపుణులు?
వృషభం (Taurus) : ఈ రాశి వారు చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. దీనివల్లే వీరి డేటింగ్ దెబ్బ తింటుంది. చికాకు కలిగిస్తుంది. డేటింగ్ రోజు ఏం చేయాలి.. ఏలా ఉండాలి.. ఎలా ఎదుటివారిని హ్యాపీ చేయాలి.. అలా చేస్తే బాగుంటుందా? ఇలా చేస్తే బాగుంటుందా?.. ఇలా ప్రతీ దానికి ఎక్కువగా ఆలోచించేస్తారు. డేటింగ్ అనేది చాలా ఓపెన్ గా స్వేచ్ఛగా.. మిమ్మల్ని మీరుగా ప్రజెంట్ చేసుకోవడం అనేది మర్చి పోతారు. అలా కాకుండా ఎక్కువ కష్టపడి నష్టపోతారు.
కన్య (Virgo) : కన్యారాశివారు చాలా కఠినంా కనిపిస్తారు. కొత్త వ్యక్తులకు వీరు అస్సలు నచ్చరు. సరదాగా, ఫ్రీగా ఉండలేరు. ఏ విషయంలోనైనా సున్నితంగా ఉండాల్సిన దాంట్లో కూడా కాస్త హార్ష్ గానే ఉంటారు. అందుకే వీరితో డేటింగ్ అంటే జనాలు పారిపోతారు.
ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశివారితో డేటింగ్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే వారు ఒక వ్యక్తికే పరిమితం కావడాన్ని ఇష్టపడరు. ఈ రాశి వారు ఎవరితోనైనా డేటింగ్ లో ఉంటే.. వారితో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా విడిపోవడానికి ప్రయత్నిస్తారు. ఇది వారి పార్టనర్ కు చికాకును పుట్టిస్తుంది.
capricorn
మకరం (Capricorn) : ఈ రాశి వారు డేటింగ్‌పై దృష్టి పెట్టకుండా కెరీర్‌పై దృష్టి పెట్టారు. దీనివల్ల వారి వ్యక్తిగత జీవితంలో చాలా గందరగోళాన్ని సృష్టిస్తుంది. తమ వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాలను సమతుల్యం చేసుకోలేరు. అందుకే ఈ రాశివారు డేటింగ్ గేమ్‌లో అస్సలు కనిపించరు.
కుంభం (Aquarius) : కుంభరాశివారు కూడా కాస్త ధనుస్సు రాశివారిలాగే ఉంటారు. ఒక వ్యక్తికి కట్టుబడి ఉండడం వీరికి ఇష్టం ఉండరు. అంతేకాదు, వీరు చాలా సిగ్గరులు. అంత త్వరగా ఒక మనిషిని విశ్వసించలేరు. ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి డేటింగ్ ఇబ్బందిగా మారుతుంది.
వీరు కాకుండా కొన్ని రాశుల వాళ్లు డేటింగ్ లో తోపులుగా ఉంటారు. వారితో వుంటే ఫుల్ ఎంజాయ్ చేయచ్చు. ఆ రాశుల ఏవంటే.. మేషం, జెమిని, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, మీనం చాలా మంచి భాగస్వాములు. ఎందుకంటే వారు రిలేషన్ లో తమ భాగస్వామి అవసరాల విషయంలో చాలా సున్నితంగా ఉంటారు.