కొంతమంది వివాహం చేసుకోవాలనే ఆలోచననే తట్టుకోలేరు. పెళ్లితో మరొకరితో జీవితాన్ని పంచుకోవాలని.. కలిసి నడవాలన్న ఆలోచన కూడా వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. జీవితాంతం ఒక వ్యక్తితో ముడిపడి ఉండాలనే ఆలోచన వారిని విపరీతంగా భయపెడుతుంది. అందుకే పెళ్లి అన్న ప్రతీసారి కుంగిపోతారు. ఏదో ఒక వంకతో పెళ్లిని ఎత్తగొడుతుంటారు. అయితే, అది మీ తప్పు కాదు. మీ రాశిలోనే ఆ తేడా ఉందట.. దీన్ని సరిచేయచ్చు అంటున్నారు జ్యోతిష్య శాస్త్రవేత్తలు. అలాంటి రాశులేవో.. వాటిలో మీ రాశి ఉందో చెక్ చేయండి.
కుంభం (Aquarius)
ఈ రాశివారు చాలా స్వేచ్ఛా జీవులు. అందుకే ఒక వ్యక్తికి పరిమితం కావడానికి ఇష్టపడరు. వీరి ఉద్దేశ్యంలో ఓ వ్యక్తిని పెళ్లి పేరుతో జీవితాంతం కట్టిపడేయడం చాలా దారుణమైన విషయం. అందుకే పెళ్లి అంటేనే భయపడతారు. అందుకే వీలైనంత వరకు వివాహం అంటేనే.. అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తారు.
మిథునం (Gemini)
మిథునరాశివారు సరదాగా ఉండడానికి ఇష్టపడతారు. అందరితో తొందరగా కలిసిపోతారు. కానీ జీవితాంతం ఒక వ్యక్తితో కలిసి ప్రయాణించడం వీరికి ఇష్టం ఉండదు. ఒకసారి పెళ్లి అయితే తాము అంతకు ముందు ఉన్నంత సరదాగా, ఫ్రీగా ఉండలేమని భావిస్తారు. అందుకే పెళ్లి అంటే భయపడతారు. పెళ్లి నిర్ణయాన్నే దూరంగా తోసేస్తారు.
ధనుస్సు (Sagittarius)
వీరి దృష్టిలో పెళ్లి అంటేనే సమస్యల వలయం.. అందుకే పెళ్లి తమకు కుదిరే పని కాదని అనుకుంటారు. పెళ్లి చేసుకుంటే బాధ్యతగా ఉండాలి, కట్టుబడి ఉండాలి..అనే భావనే వీరు తట్టుకోలేరు. భయాందోళన కలిగిస్తుంది.
సింహం (Leo)
వివాహం వీరిని భయపెడుతుంది. వివాహ బంధంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడం కష్టంగా ఉంటుంది. ఆ భయం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. అందుకే పెళ్లి అంటే అనాసక్తి చూపుతారు. పెళ్లి చేసుకుని పెద్దవారిలా వ్యవహరించడాన్ని ఊహించుకోలేరు.
మకరం (Capricorn)
మీరు మీ మనస్సును పెళ్లినుంచి మళ్లించడానికి మీ దృష్టి అంతా మీ కెరీర్‌పై పెడతారు. ఎవరితోనైనా వివాహం జరగడం మీకు చాలా పెద్ద భారంగా అనిపిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు దానిని నివారించడానికి ప్రయత్నిస్తారు. అయితే పెద్దగా బాధ్యత లేకుండా పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితులు ఎదురైతే దానికి కట్టుబడి ఉంటారు.
పెళ్లి అంటేనే పారిపోయే రాశులు ఇవి అయితే... పెళ్లిని ఇష్టపడే రాశులు కొన్ని ఉన్నాయి. మేషం, వృషభం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చికం, మీన రాశివారు వివాహ ఆలోచనను ఇష్టపడతారు. పెళ్లి చేసుకుంటే ఓ వ్యక్తి తమకు జీవితాంతం తోడుగా ఉంటారనే ఆలోచన వారికి చాలా ఇష్టం.