మీ బంధం దీర్ఘకాలం కొనసాగాలంటే.. వ్యక్తిత్వాన్ని కోల్పోకండి...

First Published Dec 8, 2022, 2:15 PM IST

దీర్ఘకాల అనుబంధానికి ఇద్దరి మధ్య ప్రేమ ఎంత ముఖ్యమో.. ఆ బంధంలో వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా ఉండడమూ అంతే ముఖ్యం. అదెలా అంటే.... 

పెళ్లి కానీ, సహజీవనం కానీ, రిలేషన్ షిప్ కానీ.. ఒకరితో ముడిపడ్డాక.. ఇక వారితోడిదే లోకం అనుకోవడం మామూలే. ఎదుటివారిని సంతోషపెట్టడానికి, వారి ఇష్టాయిష్టాలను తెలుసుకుని.. నచ్చేలా మారడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. అదే సమయంలో తమని తాము మరిచిపోయి.. తామే వారుగా.. వారే తాముగా మారిపోతుంటారు. మీ బంధం ఎక్కువ కాలం బలంగా ఉండడానికి ఇది సరికాదంటున్నారు నిపుణులు. అలా కాకుండా ఏ బంధంలోనైనా మిమ్మల్ని, మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా ఉండాలంటే ఇలా ప్రయత్నించాల్సిందే...

మీ ఫ్రెండ్స్ ను పూర్తిగా దూరం పెట్టకండి..
ఒక రిలేషన్ షిప్ లోకి ఎంటరయ్యాక మామూలుగా ఫ్రెండ్స్ తో దూరం పెరుగుతుంది. అయితే అది అంత మంచిది కాదంటున్నారు రిలేషన్ షిప్ మేనేజర్స్. మీ భాగస్వామితో కాకుండా అప్పుడప్పుడు మీ ఫ్రెండ్స్ తో చిల్ అవ్వడం వల్ల మీకంటూ ఓ ప్రపంచం ఉంటుంది. మీ భాగస్వామితో కూడా చెప్పుకోలేని కొన్ని విషయాలు స్నేహితులతో చెప్పుకోవడం వల్ల మనసు తేలికై అది మీ బంధాన్ని బలంగా ఉంచడానకి దోహదం చేస్తుంది. 
 

అన్ని విషయాలూ చెప్పేయకండి..
కొంతమంది రోజుమొత్తంలో ప్రతీ క్షణం జరిగిన విషయాలన్నింటినీ భాగస్వామితో పంచుకుంటారు. దీనివల్ల వారు ఒత్తిడికి గురవ్వడమే కాకుండా మీరు కూడా నిరాశపడే అవకాశాలుంటాయి. ఏవి చెప్పాలి.. ఏవి చెప్పుకూడదు అనేది మీరే నిర్ణయించుకోండి. మీ జిమ్ ట్రైనర్ మీద మీకు ఓ చిన్న క్రష్ లాంటిది ఏర్పడిందనుకోండి.. అదెలాగూ మీ ఇన్నర్ ఫీలింగ్.. దాంతో మీరు అతడిని మోసం చేసేదేమి లేదు. అలాంటప్పుడు అది షేర్ చేయకపోవడమే మంచిది. దీనివల్ల మీ బంధం ఇబ్బందుల్లో పడకుండా ఉంటుంది. 

gardening

కొన్ని పనులు ఒంటరిగా కూడా చేయచ్చు.. 
ఇద్దరూ జీవితాన్ని పంచుకున్నప్పుడు.. అన్ని పనులూ కలిసే చేసుకోవాలనుకోవడం మంచిదే. కానీ ప్రతీ నిమిషం, ప్రతీ చిన్నదానికి ఇద్దరూ కలిసి చేయాలనుకోవడం కరెక్ట్ కాదు. కొన్నింటిని మీరు సొంతంగా ఒక్కరే చేసుకోవడం.. ఆ తరువాత దాని అనుభవాలను మీ భాగస్వామితో పంచుకోవడం మరింత బాగుంటుందట. గార్డెనింగ్, కుకింగ్.. లేదా ఇంకేదైనా మీకిష్టమైన అభిరుచిని ఇద్దరూ కలిసి కాకుండా మీరే ఒంటరిగా ప్రాక్టీస్ చేసి ఆ అనుభవాలు వారితో పంచుకుని చూడండి.

Money image

ఎవరి డబ్బులు వారివే...
ఇద్దరూ కలిసి జీవితప్రయాణం చేస్తున్నారు కాబట్టి.. ఇద్దరి సంపాదనా ఒక్కటే అనే భావన కరెక్ట్ కాదు. దీనికోసం జాయింట్ అకౌంట్ కాకుండా.. సెపరేట్ అకౌంట్లే మెయింటేన్ చేయండి. డబ్బు ఎలాంటి రిలేషన్ ను అయినా పాడు చేస్తుంది. అయితే దీన్ని మీరేం సీక్రెట్ గా మెయింటేన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు వేరే అకౌంట్ లేదా మీ దగ్గర డబ్బులు ఉన్నాయన్న సంగతి మీ భాగస్వామికి తెలిసి ఉండాలి. కాకపోతే దానిమీద పూర్తి నిర్ణయాధికారం మీదే అయి ఉండాలి. 

click me!