Relationship: అమ్మాయిలు ఎక్కువగా వీళ్ళతోనే ప్రేమలో పడతారు.. కారణం ఏంటో తెలుసా!

First Published | Sep 8, 2023, 11:15 AM IST

 Relationship: సాధారణంగా అమ్మాయిలు అల్లరి చిల్లరగా తిరిగే అబ్బాయిల లవ్ లోనే పడిపోతూ ఉంటారు. దీని వెనక కారణమేమిటో ఎప్పుడైనా ఊహించారా.. తెలుసుకొనే ప్రయత్నం చేశారా.. లేదా! అయితే ఇప్పుడు తెలుసుకుందాం.

 సాధారణంగా ఇంటర్ చదివే అమ్మాయిలు ఆటో తోలుకునే వ్యక్తితోనూ, 10th చదువుకునే అమ్మాయిలు పానీపూరి అబ్బాయిలతోనూ ప్రేమలో పడిపోతూ ఉంటారు. చాలామంది సిన్సియర్ గా ప్రేమిస్తున్న అబ్బాయిల వైపు కన్నెత్తి కూడా చూడని ఈ ఆడపిల్లలు ఎందుకు అలా అల్లరి చిల్లరగా తిరిగే అబ్బాయిలు ప్రేమలో పడిపోతారు..
 

 ఇది ఇప్పటి వరకు ఎవరికీ తెలియని విషయం అయితే అమ్మాయిలు చాలా సున్నిత మనస్తత్వం కలవారు. వారికి ఎవరైనా వ్యక్తి కొంచెం ధైర్యం ఇచ్చేటట్లు కనిపించినా, నిజాయితీగా మాట్లాడుతున్నట్లు కనిపించినా చాలా తేలికగా నమ్మేస్తూ ఉంటారు. ఇలాంటి ఆడపిల్లలు ఎక్కువగా..
 


 ఇంట్లో ప్రేమ, ఆదరణ నోచుకోని పిల్లలయి ఉంటారు. బయట వాళ్ళు కాస్తంత ప్రేమ, చొరవ చూపించేసరికి అదే నిజం అనుకొని ఆ అల్లరి చిల్లర వ్యక్తుల ప్రేమలో పడిపోతారు. ముఖ్యంగా స్త్రీలు భద్రతనే కోరుకుంటారు. అల్లరి చిల్లరగా తిరిగే వ్యక్తి యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందంటే..
 

 మేము సమాజంలో దేనినైనా ఎదుర్కోగలం అనే స్థాయిలో కలరింగ్ ఇస్తూ ఉంటారు. అది చూసిన అమ్మాయిలు నిజంగానే వీడు తనకి భద్రత ఇస్తాడు అనుకుంటుంది. అలాగే ఒక అమ్మాయి సాధారణంగా స్వేచ్ఛని కోరుకుంటుంది. అలాగే అల్లరి చిల్లర అబ్బాయిలు కూడా..
 

 స్వేచ్ఛగా తిరుగుతూ ఉండడం చూసి తనకి ఇంట్లో దొరకని స్వేచ్ఛ ఆ వ్యక్తి దగ్గర దొరుకుతుంది అనుకొని అతనికి దగ్గరవుతుంది. ఇంట్లో ఆడపిల్లలు ఏది అడిగినా తల్లిదండ్రులు పద్ధతి ప్రకారం అవసరమైతేనే కొని పెడుతూ ఉంటారు. అయితే ఈ ఆవారాగాళ్ళు అమ్మాయిలు..
 

 అడగ్గానే ఐఫోన్ కూడా తెచ్చి ఇచ్చేస్తూ ఉంటారు. జీవితాంతం వాళ్లకి ఇలాంటి సర్ప్రైజ్లే ఎక్స్పెక్ట్ చేసిన అమ్మాయిలు వాళ్ళ లవ్ లో పడిపోతారు. కానీ ఒక్కసారి వాళ్ళకి లొంగిన తర్వాత ఈ అమ్మాయిలని కాళ్ళ కింద చెప్పులు లాగా చూస్తారని విషయం తెలిసేసరికి వీళ్ళ జీవితం దారి తప్పిపోతుంది. కాబట్టి అమ్మాయిలూ ఆలోచించి అడుగు ముందుకు వేయండి.

Latest Videos

click me!