Relationship: అమ్మాయిలు మీకు ఇలాంటి మెసేజ్ లు పంపిస్తున్నారా.. అంటే మీతో రిలేషన్ కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్ట

First Published | Sep 6, 2023, 3:34 PM IST

 Relationship: కొందరు అమ్మాయిలు తమ మనసులో మాటని అబ్బాయిలతో నేరుగా చెప్పలేరు. వారి ప్రవర్తన బట్టి అబ్బాయిలే గ్రహించాలి. మీకు అమ్మాయిలు దగ్గర నుంచి ఇలాంటి మెసేజ్లు వస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆ అమ్మాయి మీతో రిలేషన్ కోరుకుంటున్నట్లే. ఆ మెసేజ్ లు ఏంటో చూద్దాం.
 

 సాధారణంగా ఒక అమ్మాయి ఎప్పుడూ నేరుగా తన మనసులో అభిప్రాయాన్ని తను కోరుకున్న వాడికి చెప్పలేదు. కానీ ఆమె ప్రవర్తనా విధానాన్ని బట్టి ఆ అబ్బాయి గ్రహించాలి. ఒక అమ్మాయి దగ్గర నుంచి మీకు విషయం ఏమి లేకపోయినా పదేపదే మెసేజ్లు వస్తున్నట్లయితే ఆమె  మీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు లెక్క.
 

అలా అని మీరు డైరెక్టుగా అప్రోచ్ అవ్వకుండా ఆమె మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. పాజిటివ్ గా అనిపిస్తే అప్పుడు ఒక అడుగు అబ్బాయిలే ముందుకు వేయాలి. అలాగే ఒక అమ్మాయి మీతో ఎక్కువ కాలం నుంచి పరిచయం లేనప్పటికీ తన పర్సనల్స్..
 


తన ఫీలింగ్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటుంది అంటే అది కూడా మీతో రిలేషన్ కి సిద్ధంగా ఉన్నాను అని ఇచ్చే సంకేతమే. అలాగే ఒక అమ్మాయి మీ గురించి ప్రతి చిన్న విషయం గురించి కేర్ తీసుకుంటుంది అంటే అది కూడా ఆ అమ్మాయి మీకు ఇచ్చే సిగ్నల్. మీరే అర్థం చేసుకోవాలి.
 

 అలాగే ఒక అమ్మాయి మీతో గడిపిన క్షణాలని ఎక్కువగా సోషల్ మీడియాలో పెడుతూ మీ గురించి పదిమందికి పాజిటివ్గా చెప్తూ ఆనంద పడుతుందో అలాంటి అమ్మాయి మీతో రిలేషన్ కి  రెడీగా ఉందని అర్థం. అలాగే ఒక అమ్మాయి ఎలాంటి కారణం లేకుండానే పదేపదే మిమ్మల్ని పొగుడుతూ మెసేజ్ లు పెట్టినా కూడా అమ్మాయి మీతో రిలేషన్ కి సిద్ధంగా ఉందని అర్థం.
 

ఎందుకంటే ఒక ఆడపిల్ల అందరి గురించి అంత ప్రత్యేకమైన శ్రద్ధ చూపించదు. అలాగే మీరు వేరే ఎవరితో అయినా కొంచెం క్లోజ్ గా మూవ్ అవుతున్నట్లు కనిపిస్తే పొసెసివ్  గా ఫీల్ అవుతూ మీ గురించి ఆరాలు తీస్తూ మీకు మెసేజ్ లు పెట్టిందంటే ఆ అమ్మాయి..

 ఎక్కడ మిమ్మల్ని మిస్ అయిపోతుందో అని కంగారు పడుతుందని అర్థం. మీకు గనుక ఆ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒక అడుగు ముందుకు వేయటానికి ఇదే మంచి ఛాన్స్. సో అబ్బాయిలు ఇంక మీదే ఆలస్యం.

Latest Videos

click me!