ఒక కొత్త వ్యక్తితో జీవితం ప్రారంభించినప్పుడు చాలా అందంగా, ఆనందంగా అనిపిస్తుంది. రాను రాను భాగస్వాములలో వచ్చే మార్పులే మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. అంటే ఒక నిజాయితీ, స్వచ్ఛమైన ప్రేమ కలిగిన భాగస్వాముల వలన మన జీవితం స్వర్గంలా మారుతుంది.
కొందరి అపనమ్మకం, స్వార్థపూరిత లక్షణాలు మన జీవితాన్ని అధోగతి పాలు చేస్తాయి. అందుకే మీ భాగస్వాములో ఇలాంటి లక్షణాలు ఉన్నాయేమో గుర్తించండి. మీ భాగస్వామి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటూనే మీకు దూరంగా ఉంటుంది.
మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తి మీ అవసరాలు చూడకుండా ఎక్కడో ఉంటూ ఐ లవ్ యు అని ఒక మెసేజ్ పెట్టడం వలన అది నిజమైన బంధం అనిపించుకోదు. మన అవసరాలతోనూ, మన ఎమోషన్స్ తోనూ సంబంధం లేని వ్యక్తి ఎప్పటికీ నిజమైన భాగస్వామి కాలేదు.
అలాగే తప్పు చేస్తుందన్న విషయం తెలిసి కూడా తప్పు ఒప్పుకోవడానికి ఇష్టపడని ఒక భాగస్వామిని భరించటం చాలా కష్టం. ఆమె (అతడు ) ఎప్పుడు, ఎటువంటి తప్పు చేసి నింద మన మీద వేస్తుందో అనే భయంతోనే జీవితం నెట్టుకు రావాల్సి వస్తుంది.
ఇలాంటి మూర్ఖులకి ఎంత త్వరగా బ్రేకప్ చెప్తే అంత మంచిది. అలాగే ఎమోషనల్ గా మీ మీద డిపెండ్ అవుతూ మిమ్మల్ని ఎమోషనల్ గా మరింత బ్లాక్ చేస్తున్న భాగస్వాములు కూడా ప్రమాదకరమే. ఎందుకంటే వీళ్ల అతి ప్రేమతో మన ముందరకాళ్ళకి బంధాలు వేస్తారు.
ప్రేమ అని వాళ్ళు అనుకుంటారు కానీ అది మన స్వేచ్ఛకి ఎంతగా అంతరాయం కలిగిస్తుందో గ్రహించలేక పోతారు. వాళ్ల మాట కాదు అన్నందుకు ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధపడి పోతారు. ఇలాంటి భాగస్వాములకు కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బ్రేకప్ చెప్పడం అవసరం.