మన దగ్గర ఇలా ఉంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో మాత్రం సీన్ తలకిందులుగా ఉంది. పెళ్లైన వెంటనే కొత్త కోడలి చేతికి తాళాలు వెళ్లిపోతాయి. ఇంట్లో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదో తేల్చేసే చట్టం అమల్లోకి వచ్చేసింది. అంటే కొత్త కోడలు తన భర్తతో కలిసి ఇంట్లో అత్తామామలు ఉండాలా, వద్దా అని తేల్చేస్తుంది. ఒకవేళ ఆమెకి ఇష్టం లేకపోతే అత్తామామలు మూటా ముల్లె సర్దుకొని వేరు కాపురం పెట్టాల్సిందే. అత్తామామలు కొత్త జంటతోనే ఉండాలనుకుంటే వాళ్లను బతిమిలాడుకొని అనుమతి తీసుకోవాల్సిందే. ఏప్రిల్ 15 నుంచి ఈ పర్సనల్ స్టేటస్ లా అమలులోకి వచ్చింది.