Relationship: భార్యాభర్తలు బాగుండాలంటే చేయాల్సింది ఇదే..!

Published : Apr 17, 2025, 06:04 PM IST

మీ జీవిత భాగస్వామిని ప్రశంసించడం వల్ల వాళ్లకు ప్రత్యేకంగా అనిపిస్తుంది, మీ బంధం కూడా దృఢంగా అవుతుంది. మీ జీవిత భాగస్వామిలో ఉన్న మంచి గుణాలను, వాళ్ళ అలవాట్లను ప్రశంసిస్తే వాళ్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

PREV
15
Relationship: భార్యాభర్తలు బాగుండాలంటే చేయాల్సింది ఇదే..!
Couple


Happy Married Life: పెళ్లి అంటే  జీవితాంతం కలిసి ఉండే బంధం. ఈ రోజుల్లో చాలా మంది ఈ బంధానికి భయపడుతున్నారు. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళ ప్రేమ తగ్గిపోతుందేమో, విడిపోతామేమో అని అనుకుంటున్నారు. అందుకే చాలా మంది పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. కానీ వైవాహిక జీవితంలో కొన్ని చిట్కాలు ఫాలో అయితే.. వందేళ్లు విడిపోతాం అనే భయం లేకుండా సంతోషంగా జీవించవచ్చు. మరి అవేంటో చూద్దామా..

25
Couple

సమయం కేటాయించండి
పెళ్లయ్యాక చాలా మంది తమ జీవిత భాగస్వామికి సమయం కేటాయించలేకపోతున్నారు. కానీ ఒకరితోఒకరు ఎక్కువ సమయం గడపడం చాలా ముఖ్యం. ఇద్దరూ కలిసి డిన్నర్‌కి వెళ్లొచ్చు, వారాంతాల్లో బయట తిరగొచ్చు, ఇంట్లో సినిమా చూడొచ్చు. సాయంత్రం కాసుపు కూర్చొని రోజంతా వారికి ఎలా గడిచిందో చెప్పుకోవాలి. ఇది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలే మీ సంసార జీవితాన్ని సంతోషంగా ఉంచుతాయి.
 

35

ప్రశంసించుకోండి
మీ జీవిత భాగస్వామిని ప్రశంసించడం వల్ల వాళ్లకు ప్రత్యేకంగా అనిపిస్తుంది, మీ బంధం కూడా దృఢంగా అవుతుంది. మీ జీవిత భాగస్వామిలో ఉన్న మంచి గుణాలను, వాళ్ళ అలవాట్లను ప్రశంసిస్తే వాళ్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీనివల్ల మీతో మరింత దగ్గరవుతారు, మీ ప్రేమ కూడా పెరుగుతుంది.

45
Couple

మనసులో మాట బయటపెట్టండి
కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు, గొడవలు వస్తాయి. అలాంటప్పుడు ఓపిక చాలా ముఖ్యం. ఓపికగా ఉండి, మీ జీవిత భాగస్వామి మాట వినడానికి ప్రయత్నిస్తే మీ బంధం మరింత స్థిరంగా ఉంటుంది. ఏదైనా విషయంపై గొడవ జరిగితే, ఏమీ మాట్లాడకుండా ముందు ఓపిక పట్టండి. ఆ తర్వాత ప్రశాంతంగా మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోండి. మీ మనసులో ఏముందో స్పష్టంగా చెప్పండి.

55

గౌరవం ముఖ్యం
ప్రతి బంధంలో గౌరవం చాలా ముఖ్యం. మీ జీవిత భాగస్వామిని గౌరవిస్తే వాళ్ల ఆత్మగౌరవం పెరుగుతుంది. ఒకరినొకరు ప్రేమించుకోవడం, గౌరవించుకోవడం, ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవడం, ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎప్పుడూ కలిసి ఉండాలని లేదు, కానీ ఒకరినొకరు అర్థం చేసుకుని, గౌరవించుకోవాలి. చిన్న చిన్న విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉంటే మీ బంధం మరింత బలపడుతుంది.

అభిప్రాయ భేదాలు సహజం
 సంతోషంగా ఉండాలంటే మీ బిజీ జీవితంలో కొంత సమయాన్ని మీ జీవిత భాగస్వామికి కేటాయించాలి. ప్రతి నెలా లేదా రెండు నెలలకు ఒకసారి డేట్ నైట్ ప్లాన్ చేసుకుని కలిసి సమయం గడపాలి. ఇలా చేస్తే మీ బంధం మరింత గాఢమవుతుంది. పెళ్లయ్యాక కూడా మీ ఇష్టాలు, అభిరుచులు, లక్ష్యాలను ముఖ్యమైనవిగా భావించాలి. మీరు వ్యక్తిగతంగా సంతోషంగా ఉంటేనే మీ బంధం కూడా సంతోషంగా ఉంటుంది. కొన్నిసార్లు అభిప్రాయ భేదాలు రావడం సహజం, కానీ వాటిని పెద్దవి చేసుకోకుండా సమయానికి పరిష్కరించుకోవాలి.
 

Read more Photos on
click me!

Recommended Stories