సాధారణంగా ఇద్దరు వ్యక్తులు ప్రేమలో పడినప్పుడు వారి ప్రవర్తన మొత్తం మారిపోతుంది. ప్రపంచంలో వారిద్దరే ఉన్నట్టు, ప్రపంచంలో ఉన్న ఆనందమంతా వాళ్ళ సొంతమైనట్టు ఊహాలోకాల్లో తేలిపోతూ ఉంటారు. మీ మనసుకు నచ్చిన వ్యక్తిని చూసినప్పుడు మీ కళ్ళల్లో మీకు తెలియకుండా వెలుగు వచ్చినట్టు కనిపిస్తుంది.