ఇలా అయితే మీది వన్ సైడ్ లవ్వే..!

First Published | Sep 15, 2023, 2:42 PM IST

ఒక్కరూ మాత్రమే లవ్ చేయడాన్ని వన్ సైడ్ లవ్ అంటారు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించాలంటే మాత్రం ఒక్కరే కాదు ఇద్దరూ కూడా ప్రేమలో పడాలి. కానీ వన్ సైడ్ లవ్ ఎక్కువ కాలం ఉండదు. అంతేకాక ఇది ఎంతో బాధను కలిగిస్తుంది. 

మానసిక ఒత్తిడి పెరగడానికి లేని ప్రేమ కూడా ప్రధాన కారణమంటున్నారు నిపుణులు. అవును కొంతమంది భాగస్వాములు తమ భాగస్వామి ఏం చేస్తుంది? ఏం తింటుంది? అంటూ ప్రతి విషయాన్ని పట్టించుకుంటారు. వారి కోరికలకే ప్రాధాన్యతనిస్తారు. కానీ అవతలి భాగస్వామి మాత్రం వీరి ఇష్టా ఇష్టాలను తెలుసుకోరు. అలాగే వారితో మాట్లాడటానికి ఇంపార్టెన్స్ ఇవ్వరు. ప్రేమున్న వ్యక్తి ప్రతిదీ భాగస్వామికి అనుగుణంగా చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అవతలి భాగస్వామి మాత్రం వీరి భావాలను పట్టించుకోరు. ఇది క్రమంగా సంబంధంలో విభేదాలకు దారితీస్తుంది. అంతేకాదు  ఇది వన్ సైడ్ లవ్ కిందికే వస్తుంది. 

ఒక వ్యక్తి పై ఉన్న శ్రద్ధా, వారి స్వభావం, అభిరుచే మనకు ప్రేమను కలిగిస్తాయి. కానీ ఇది మన జీవితంలో ఎన్నో మలుపులు తిప్పుతుంది. ముందుగా ఒక వ్యక్తి ఒకరిపట్ల ఆకర్షితుడవుతాడు. ఆ తర్వాత వన్ సైడ్ లవ్ స్టార్ట్ అవుతుంది. కానీ అవతలి వ్యక్తి కూడా మిమ్మల్ని లవ్ చేయాలి. అప్పుడే మీ ఇరువురి జీవితం సాఫీగా సాగుతుంది. ప్రేమలేని ఇద్దరు వ్యక్తులు కలిసి ఉంటే ఎన్నో సమస్యలు వస్తాయి. ఇది మీరు విడిపోయే దాక కూడా వెళ్లొచ్చు. 


Image: Getty

వన్ సైడ్ రిలేషన్స్ గురించి నిపుణులు ఏమంటున్నారంటే..

వన్ సైడ్ ప్రేమలో మీరు బలహీనంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అలాగే మీ సంబంధం పట్ల మీకు నమ్మకం ఉండదు. వన్ సైడ్ లవ్ లో మీరు మీ భాగస్వామి సంతోషం కోసం ఎంతో ప్రయత్నిస్తారు. కానీ భాగస్వామి నుంచి మాత్రం ప్రేమను పొందలేకపోతారు. బలమైన సంబంధానికి నమ్మకం, ప్రేమ, సంరక్షణ ఎంతో అవసరం. దీంతో ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది. 
 

వన్ సైడ్ రిలేషన్ షిప్ సంకేతాలు 

ఉత్సాహంగా లేకపోవడం

వన్ సైడ్ రిలేషన్ షిప్ తో సతమతమవుతున్న వ్యక్తులు ఎప్పుడూ కూడా ఉత్సాహంగా, సంతోషంగా ఉండరు. చిన్న చిన్న విషయాలకు కూడా ఇబ్బంది పడతారు. అంతేకాకుండా ప్రతి కష్టంలోనూ ఒంటరిగా కనిపిస్తారు. మీ భాగస్వామితో కలిసిపోలేకపోవడం వల్ల మీరు ఎంతో ఆందోళనకు గురవుతారు. 

Image: Getty

పనికిరాని రిలేషన్ షిప్ 

అలాంటి వారు తమ రిలేషన్ షిప్ ను నిస్సారంగా భావిస్తారు. వీరి జీవితంలో ఆనందం అనేదే ఉండదు. ఎప్పుడూ చిరాకు పడుతుంటారు. రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు కూడా జీవిత భాగస్వామితో కనెక్ట్ కాలేకపోతుంటారు. 
 

Image: Getty

కమ్యూనికేట్ చేయలేకపోవడం

రిలేషన్ షిప్ వన్ సైడే  ఉంటే ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ బాగా పెరుగుతుంది. ఇలాంటి సంబంధంలో ఒక వ్యక్తి ఎప్పుడూ సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నిస్తే.. మరొక వ్యక్తి తన జీవితంలో బిజీగా ఉంటాడు. అలాగే మీ రిలేషన్ షిప్ ను తేలిగ్గా తీసుకుంటాడు. ఇది రిలేషన్ షిప్ లో ఒంటరితనం, దూరాన్ని పెంచుతుంది.
 

ప్రతి తప్పుకు బాధ్యత వహించడం

తమ రిలేషన్ షిప్ లో పూర్తిగా డెడికేటెడ్ గా ఉండే వ్యక్తులు తమ భాగస్వామి చేసే ప్రతి తప్పుకు బాధ్యత వహించడానికి అస్సలు వెనుకాడరు. అంతేకాక చేసిన ప్రతి తప్పుకు తానే క్షమాపణలు చెబుతాడు. ఎలాంటి గొడవలనైనా తామే పరిష్కరించుకోవడంతో పాటు భాగస్వామి కోపాన్ని కూడా పోగొట్టడానికి ముందుకు వస్తాడు. 
 

మీ సంతోషం గురించి పట్టించుకోకపోవడం

ప్రతిచోటా త్యాగం చేసేటప్పుడు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం మర్చిపోతారు. మీ భాగస్వామిని ఎప్పుడూ ఆనందంగా  ఉంచడానికి మీ సంతోషానికి విలువనివ్వరు. వన్ సైడ్ ప్రేమలో భాగస్వామికి మీ ప్రాముఖ్యత తెలియదు. మీ సుఖదుఃఖాలు అతనికి ముఖ్యం కాదు. అలాంటి వారు తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు.

Latest Videos

click me!