Relationship: బంధం బలపడాలంటే.. భార్యాభర్తలు హద్దుల్లో ఉండాల్సిందే!

First Published | Sep 15, 2023, 5:40 PM IST

 Relationship: ఎంత అన్యోన్యమైన దాంపత్యమైనప్పటికీ భార్యాభర్తల మధ్య హద్దులు ఉంటేనే బంధం బలపడుతుంది. హద్దులు లేని ప్రేమ ఎప్పటికైనా ప్రమాదమే అంటున్నారు రిలేషన్ ఎక్స్పర్ట్స్. అయితే భార్యాభర్తల మధ్య ఉండవలసిన హద్దులు ఏమిటో చూద్దాం.
 

 భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉన్నప్పటికీ  ఎవరి హద్దుల్లో వారు ఉంటే ఒకరి మీద ఒకరికి గౌరవం పెరుగుతుంది. నా భర్తే  కదా అని ఒక భార్య,  భర్త జీవితంలోకి అతి చొరవ  చూపిస్తే అది ఆ భర్తకి ఎంతో ఇబ్బందిని కలుగచేస్తుంది. అలాగే నా భార్య కదా అని ఒక భర్త భార్య మనోభావాలు తెలుసుకోకుండా అధికారం చూపిస్తే అది ఆ బంధానికి బీటలు వారే ప్రమాదం ఏర్పడుతుంది.
 

 కాబట్టి ఎవరి హద్దుల్లో వారు ఉంటూ ఎవరి గౌరవాన్ని వారు కాపాడుకుంటూ ఉండాలి. అలాగే భాగస్వామి ప్రవర్తన హద్దు దాటింది అనిపించినప్పుడు వాళ్లకి మీ అభిప్రాయాన్ని చెప్పడంలో ఎలాంటి మొహమాటం ప్రదర్శించకూడదు. ఎంత అన్యోన్యమైన దంపతులైనప్పటికీ..
 

Latest Videos


 కొన్ని విషయాలు జీవిత భాగస్వామితో పంచుకోలేం. దీనినే వ్యక్తిగత గోప్యత అంటారు. ప్రతి ఒక్కరూ తమకోసం తాము కొంత సమయాన్ని కేటాయించుకుంటారు. అలాంటి సమయంలో భాగస్వామి వెళ్లి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండాలని కోరుకుంటారు.
 

 ఆ భాగస్వామి ఆ కోరికకి  విలువ ఇస్తే అతని గౌరవాన్ని నిలబెట్టుకున్న వాడు అవుతాడు. లేదంటే ఆమె దృష్టిలో అతను గౌరవాన్ని కోల్పోతాడు. అలాగే శృంగారంలో కూడా భాగస్వామి ఆట వస్తువు కాకూడదు. ఇద్దరికీ ఇష్టమైనప్పుడు మాత్రమే ఆ కార్యానికి సిద్ధమవ్వాలి.
 

 ఇది మనోభావానికి సంబంధించిన హద్దులు కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. అలాగే భార్యాభర్తలకి ఎవరి పర్సనల్ లైఫ్  వాళ్ళకి ఉంటాయి. వాళ్ళ ఫ్రెండ్స్ తో లేదంటే వాళ్ళ రిలేషన్స్ తో బయటికి వెళ్ళినప్పుడు భాగస్వాములు తెలుసుకోవాలనుకోకూడదు.
 

 అలాగే ఆరాలు కూడా తీయకూడదు. ప్రతి చిన్న విషయాన్ని భాగస్వామికి చెప్పటం అనేది ఫ్రస్టేషన్ కి గురిచేస్తుంది అనే విషయం గ్రహించండి. ఈ హద్దులు భార్యాభర్తలు ఇద్దరికీ వర్తిస్తాయి కాబట్టి భాగస్వామి మనసు తెలుసుకొని ప్రవర్తిస్తే బతకంతా ఆనందమే.

click me!