Relationship Tips: భర్త నుంచి భార్య నిజంగా ఏం కోరుకుటుందో తెలుసా?

Published : Oct 10, 2025, 03:21 PM IST

Relationship Tips: భార్య మనసు అర్థం చేసుకోవడంలో దాదాపు భర్తలందరూ ఫెయిల్ అవుతూనే ఉంటారు. కేవలం ఖరీదైన బహుమతులు, బంగారం లాంటివి మాత్రమే కోరుకుంటారు అని అనుకుంటారు. కానీ, అంతకు మించి వారు కోరుకునేవి చాలానే ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామా.. 

PREV
16
భార్యభర్తల బంధం...

వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని కోరుకోనివారు ఎవరూ ఉండరు. మరీ ముఖ్యంగా, భర్త నుంచి ప్రతి భార్య ఎక్కువ ప్రేమ కోరుకుంటుంది. కానీ.. చాలా మంది పురుషులు భార్యల ప్రేమను సరిగా అర్థం చేసుకోరు. స్త్రీలకు ఎప్పుడూ బంగారం, చీరల మీద మాత్రమే ధ్యాస ఉంటుందని, ఎప్పుడూ భర్త అవి కొనాలని కోరుకుంటారు అని అనుకుంటూ ఉంటారు. కానీ.. స్త్రీలు భర్త నుంచి బహుమతులు, ఆస్తులు, ఖరీదైన వస్తువులు కోరుకోరు. మంచి ప్రేమ, గౌరవం, సమయం కోరుకుంటారు. అసలు.. భర్త నుంచి నిజంగా భార్య కు కావాల్సినది ఏంటి?

26
1.ప్రేమగా మాట్లాడే భర్త...

ప్రతి మహిళ భర్త నుంచి ప్రేమను కోరుకుంటుంది. ఎప్పుడూ తమతో ప్రేమగా మాట్లాడాలని అనుకుంటారు. మీరు ప్రతిరోజూ ఉదయం లేచిన తర్వాత మీ భార్య నుదిటి మీద ముద్దు పెట్టండి. ఇది ఆమెను రోజంతా సంతోషంగా ఉంచుతుంది. అంతేకాదు, చిన్న చిన్న మాటలు, ప్రేమగా చూసే చూపులు వారికి మానసిక బలాన్ని అందిస్తాయి.

36
2.గౌరవం ఇవ్వడం...

మీరు ఖరీదైన బహుమతులు ఇవ్వలేకపోతే... చిన్న చిన్న బహుమతులు ఇవ్వడానికి ప్రయత్నించండి. బహుమతి ఎంత ఖరీదైనది అని కాదు.. మీరు ఆమెకు ఇవ్వాలి అనుకునే మీ ఆలోచన వారి మనసు గెలుచుకుంటుంది. అంతేకాదు... అందరి ముందు ఆమెను తక్కువ చేసి మాట్లాడొద్దు. గౌరవం ఇవ్వాలి. ముఖ్యంగా బంధువుల ముందు తక్కువ చేయకుండా, గౌరవం ఇచ్చి మాట్లాడండి.

46
3. సమయం కేటాయించడం

ఈరోజుల్లో బిజీ జీవితంలో భార్యతో మాట్లాడేందుకు చాలా మందికి సమయం దొరకడం లేదు అని చెప్పొచ్చు. కానీ అదే ఆమెకు కావలసిన అతి పెద్ద బహుమతి. రోజులో కొంతసమయం ఫోన్‌లను పక్కనపెట్టి, ఆమెతో కూర్చొని మాట్లాడండి. ఆమె రోజు ఎలా గడిచిందో అడగండి. ఇలాంటి చిన్న పనులతో మీరు మీ భార్య మనసు గెలుచుకోగలరు.

56
4. అర్థం చేసుకోవడం

ఇంట్లో ఆడవాళ్లు సంతోషంగా, నవ్వుతూ ఉండాలని.. అప్పుడే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు. భార్య కాస్త బాధగా ఉన్నా, ఏడ్చినా... అలా ఉండకూడదని చెబుతూ ఉంటారు. నిజమే.. భార్య సంతోషంగా ఉండటం ఇంటికి మంచిదే కానీ.. అలా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత భర్తదే. ప్రతిరోజూ నవ్వుతూ, సంతోషంగా ఎవరూ ఉండలేరు. వారికి కూడా అలసట, అసహనం ఉంటాయి. అలాంటి సమయంలో భార్యను అర్థం చేసుకోగలిగితే... నిజంగానే వారు సంతోషంగా ఉంటారు.

66
5.తోడు ఉన్నామనే ధీమా..

అందరు స్త్రీలు ఉద్యోగాలు చేయరు. ఉద్యోగం చేయని వారికి ఆదాయం ఉండదు. ప్రతి అవసరానికీ డబ్బు భర్తను అడగడానికి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా ఇబ్బంది పడకుండా వారికి ప్రతి అవసరంలోనూ తోడుగా ఉన్నామనే ధీమా కల్పించాలి. ఆర్థిక విషయాల్లో, ఇంటి అవసరాలు, ఖర్చుల విషయంలో ఆమె నిర్ణయాలు కూడా తీసుకోవాలి. ఆమె అభిప్రాయాన్ని కూడా గౌరవించాలి.

ఫైనల్ గా...

ప్రతి భార్య భర్త నుంచి భిన్నమైన ఆశలు పెట్టుకుంటుంది, కానీ వాటి మూలం ఒకటే. ప్రేమ, గుర్తింపు. భార్య మనసును గెలుచుకోవడానికి పెద్ద పెద్ద బహుమతులు అవసరం లేదు. ఆమెతో గడిపే కొన్ని నిమిషాల సమయం, ఒక ప్రేమపూర్వకమైన మాట, ఒక చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ చాలు.

ఇవి అన్నీ కలిస్తేనే దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories