పూర్వం పెళ్లిళ్లు అయిన తర్వాత గాని దంపతులు కలుసుకునే అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. పెళ్లికి ముందే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి వాళ్లకి చాలా స్పేస్ ఉంటుంది. ఇప్పుడు పరిచయాలు ఎక్కువగా ఆన్లైన్ ద్వారానే అవుతున్నాయి.
పెళ్లి చూపుల దగ్గర నుంచి పెళ్లి ముహూర్తాల వరకు ప్రతిదీ ఆన్లైన్లో జరిగిపోతుంది. కరోనా టైంలో అయితే పెళ్లిళ్లు కూడా ఆన్లైన్లోనే అయ్యాయి. ఇంతకీ విషయం ఏమిటంటే పెళ్ళికి ముందు ఆన్లైన్ డేటింగ్ చేస్తుంటారు చాలామంది.
ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఇద్దరూ ఆన్లైన్ డేటింగ్ చేయడం అనేది చాలా మంచిదే కానీ వాళ్ళకి డైరెక్ట్ గా ఎప్పుడు కలవాలి అనే ఒక కన్ఫ్యూషన్ వస్తుంది. మీలో ఈ లక్షణాలు కనిపిస్తే డైరెక్ట్ గా కలవచ్చు అంటున్నారు ఎక్స్పర్ట్స్.
అతని చేతిలో చేయి వేసి నడవాలనిపించినప్పుడు కానీ అతనితో కలిసి బయటికి వెళ్లాలని మీకు అనిపిస్తుంది అంటే అతనిని మీరు డైరెక్ట్ గా కలవచ్చు అనే సంకేతం మీ మనసు మీకు ఇచ్చినట్లే. అలాగే ఆన్లైన్ డేటింగ్ లో చాలా కాలం నుంచి పరిచయంలో ఉండి ఒకరి మీద..
ఒకరికి బాగా నమ్మకం వచ్చినప్పుడు కానీ, అతనితో ప్రతి విషయాన్ని షేర్ చేసుకునే అంత సాన్నిహిత్యం కలిగి, అతని చెంతన ఉంటే ప్రశాంతంగా ఉంటుంది అని మీ మనసుకి అనిపించినప్పుడు మీరు అతనిని కలవడానికి సిద్ధంగా ఉన్నారు అని అర్థం.
ఆన్లైన్ ద్వారా నే పరిచయం అయ్యి ఆన్లైన్ ద్వారానే డేటింగ్ చేస్తున్నవాళ్లు అవతలి వాళ్ళపై అంత త్వరగా ఒక నిర్ణయానికి వచ్చేయకండి. ఏదైనా మీ కళ్ళతో చూసి కానీ నమ్మకండి. ఎందుకంటే ఆన్లైన్ డేటింగ్ అనేది ఎంత ప్రయోజనకరమో అంత ప్రమాదకరం కూడా. కాబట్టి ఆలోచించి అడుగు ముందుకు వేయండి.