Relationship: కొత్త దంపతులు ఆవేశపడకండి.. అప్పుడే మీ భాగస్వామిని ఈ ప్రశ్నలు వేయకండి!

First Published | Oct 2, 2023, 2:06 PM IST

 Relationship: నేటి రోజులలో బంధం ముడి పడటం  కన్నా..ముడిపడిన బంధాన్ని నిలబెట్టుకోవడం కష్టమైన పనిగా తయారైంది. అందుకే పెళ్లి అయిన కొత్త దంపతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అప్పుడే మీ భాగస్వామిని ఇలాంటి ప్రశ్నలు వేయకండి. ఆ ప్రశ్నలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
 

సాధారణంగా పెళ్లి అయిన కొత్తజంట ప్రపంచంతో సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తూ ఎంత ఆనందంగా విహరిస్తూ ఉంటారు. అయితే అదే ఆనందంలో, అదే ఎక్సైట్మెంట్లో కొన్ని కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అది ఏంటంటే పెళ్లయిన దంపతులు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటానికి కొంత సమయం పడుతుంది.
 

 అయితే ఈ లోపే కంగారుపడి మీ భాగస్వాములని ఇలా ప్రశ్నించకండి అంటున్నారు రిలేషన్ ఎక్స్పర్ట్స్ అవేంటంటే. పెళ్లి అయిన వెంటనే ఆస్తుల గురించి, వాటి భాగస్వామ్యాల గురించి  మీ భాగస్వామిని అడగకండి. అది మీపై మీ భాగస్వామికి ఉండే గౌరవాన్ని దెబ్బతీస్తుంది.
 


అలాగే జీవిత భాగస్వామిని అర్థం చేసుకోక మునుపే జీవితంలో ఉన్న పాత సంబంధాల గురించి ఆరాలు తీయకండి. అది మీ భాగస్వామి యొక్క మానిపోయిన గాయాన్ని రేపినట్లుగా అవుతుంది. అలాగే భాగస్వామిని ఇంకా అర్థం చేసుకోక ముందే అప్పుడే తన ఫ్రెండ్స్ సర్కిల్ ని పరిచయం చేయమని అడగకండి.

అది మీలో ఉన్న లేకి బుద్ధిని మీరే బయటికి ప్రదర్శించినట్లుగా అవుతుంది. అదే సమయంలో మీ భాగస్వామి యొక్క వ్యవహారాలలో పూర్తిగా చొరబడిపోకండి. ఎందుకంటే అందరు మనుషులూ అంత తొందరగా ఎదుటి వ్యక్తులతో కలవలేరు.
 

తమ యొక్క భావవేశాలని పంచుకోలేరు. కాబట్టి మనతో కలవటానికి, వాళ్ళ ఫీలింగ్స్ మనతో చెప్పుకోవటానికి వాళ్ళకి కొంత సమయం ఇవ్వండి. అలాగే పెళ్లయిన తర్వాత మీ ఒరిజినల్ క్యారెక్టర్ లోనే మీరు ఉండండి. అవతలి వాళ్ళ మెప్పు పొందడం కోసం ఎక్కువగా నటించి మొదటికే ముప్పు తెచ్చుకోకండి.
 

 ఎందుకంటే జీవితకాలం నటించలేరు కదా. కాబట్టి మీ భాగస్వామి తన యొక్క సంకోచాన్ని వీడి తన భావవేశాలు మీతో పంచుకునే సమయం వచ్చేవరకు వేచి ఉండండి. ఒక మంచి బంధం నిలబడటం కోసం ఓపిక ఎంతో అవసరం అని గుర్తించండి.

Latest Videos

click me!