శృంగారంలో అతిగా పాల్గొంటే ఆడవాళ్లకు ఇన్ని సమస్యలొస్తయా?

First Published | Oct 1, 2023, 10:33 AM IST

శృంగారం స్త్రీ పురుషులిద్దరికీ ఎన్నో శారీరక, మానసిక ప్రయోజనాలను కలిగిస్తుంది. అంతేకాదు భార్యాభర్తల మధ్య నమ్మకాన్ని, ప్రేమను కూడా రెట్టింపు చేస్తుంది. కానీ సెక్స్ లో అతిగా పాల్గొంటే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

సెక్స్ మగవారికే కాదు  ఆడవారికి కూడా ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. సెక్స్ ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. నిజానికి ఇది వివిధ రకాల న్యూరోట్రాన్స్మిటర్లను సక్రియం చేస్తుంది. ఇవి మెదడుపై మాత్రమే కాకుండా శరీరంలోని ఎన్నో ఇతర అవయవాలపై కూడా ప్రభావం చూపుతాయి. సెక్స్ గుండెను ఫిట్ గా ఉంచుతుంది. బీపీ తగ్గిస్తుంది. అలాగే మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. ఒత్తిడిని తగ్గించి మిమ్మల్ని రిలాక్స్ గా ఉంచుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యతను పెంచుతుంది. కానీ అతి అస్సలు మంచిది కాదు. ఇది సెక్స్ కు కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. 
 

Sleeping after having sex

నిపుణుల ప్రకారం.. లైంగిక కార్యకలాపాలు మానవ జీవితంలో సహజమైన, ఆరోగ్యకరమైన భాగం. ఇది భావోద్వేగ శ్రేయస్సు, సాన్నిహిత్యానికి సహాయపడుతుంది. ఫుడ్ అయినా మరేదైనా సరే అతి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. సెక్స్ కు కూడా ఇది వస్తుంది. లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల స్త్రీలు శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
 


శారీరక అలసట

తరచుగా శృంగారంలో పాల్గొంటే చాలా శక్తి ఖర్చవుతుంది. శక్తి బర్నింగ్ మిమ్మల్ని బాగా అలసిపోయేలా చేస్తుంది. అలాగే కండరాల నొప్పి కూడా వస్తుంది. అలాగే మీ మొత్తం శక్తి స్థాయిలలో తగ్గుదలకు దారితీస్తుంది.

పునరుత్పత్తి ఆరోగ్యంపై చెడు ప్రభావం

ఎక్కువ శ్రమ, తరచూ లైంగిక కార్యకలాపాలు స్త్రీ రుతుచక్రానికి అంతరాయం కలిగిస్తాయి. ఇది ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అధిక రక్తస్రావం, మిస్సింగ్ పీరియడ్స్ కు దారితీస్తుంది. 
 

అంటువ్యాధుల ప్రమాదం 

అసురక్షితమైన పద్దతిలో సెక్స్ లో పాల్గొనడం వల్ల ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం కూడా బాగా పెరుగుతుంది. తరచుగా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటే మూత్ర మార్గము అంటువ్యాధులు అలాగే లైంగిక సంక్రమణ అంటువ్యాధులు ప్రమాదం పెరుగుతుంది. 

ఆందోళన, ఒత్తిడి

పదేపదే లైంగిక కార్యకలాపాలలో పాల్గొనడానికి లేదా కొన్ని అంచనాలను చేరుకోవడానికి ఎక్కువ ఒత్తిడికి గురవుతారు. ఇది యాంగ్జైటీకి దారితీస్తుంది. ఇది మీ మొత్తం మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
 

సంబంధాల ఒత్తిడి

లైంగిక సంబంధాలపై ఎక్కువ శ్రద్ధ కూడా భాగస్వామితో ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది అపార్ధం, అసూయ లేదా ఆగ్రహానికి దారితీస్తుంది.

భావప్రాప్తిని పొందడంలో ఇబ్బంది

తరచుగా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం వలల్ల మీరు భావప్రాప్తికి చేరుకోవడంలో ఇబ్బంది కలగొచ్చు. శరీరం ఉద్దీపనకు అనుగుణంగా ఉంటుంది.

సెక్స్ ఎక్కువ అనేదే ఉండదు. కానీ ఆడవారు తమ శరీరం గురించి పట్టించుకోవాలి. ఒక రకమైన నొప్పి లేదా అలసటగా అనిపించినా లేదా యోని డ్రైగా ఉన్నా సెక్స్ లో పాల్గొనకపోవడమే మంచిది. వారానికి ఒకటి లేదా రెండుసార్లు శృంగారంలో పాల్గొనడం ఆరోగ్యకరం. ఆడవాళ్లు సెక్స్ గురించి మాత్రమే ఆలోచించడం మంచిది కాదు. ఇలాంటి వారు సెక్సాలజిస్ట్ లేదా థెరపిస్ట్ను కలిసి సమస్యను పరిష్కరించాలి. 
 

Latest Videos

click me!