Relationship: ఈ లక్షణాలున్న అబ్బాయిలకే అమ్మాయిలు పడిపోతారు.. ఇంతకూ అవేంటంటే ?

First Published | Jul 5, 2023, 2:25 PM IST

Relationship: అమ్మాయిలని ఆకర్షించాలని ఏ అబ్బాయి అయినా కోరుకుంటాడు. అయితే అమ్మాయిలని పడేయటం అంతా ఈజీ కాదు ఎలాంటి అబ్బాయిలకి అమ్మాయిలు పడిపోతారో ఈ వ్యాసంలో చూద్దాం.
 

పూర్వం రోజుల్లో లాగా తల్లిదండ్రులు చూపించిన అబ్బాయిని చేసుకోవటానికి అమ్మాయిలు ఇష్టపడటం లేదు వాళ్ళకంటూ సొంత అభిప్రాయాలని ఏర్పరచుకుంటూ దాని ప్రకారమే వారి భాగస్వామిని ఎంచుకుంటున్నారు నేటి మహిళను అయితే ఎలాంటి..
 

లక్షణాలు ఉన్న అబ్బాయిలని అమ్మాయిలు ఇష్టపడుతున్నారో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా చదువుకున్న అమ్మాయిలు వారి కన్నా చదువుకున్న అబ్బాయిలని ఇష్టపడుతున్నారు తద్వారా జీవితంలో త్వరగా సెటిల్  అవ్వచ్చుననే ఆలోచనలో ఉన్నారు నేటి మహిళలు.
 


అయితే ఆ విషయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు కానీ ఈ విషయాలను కూడా దృష్టిలో పెట్టుకుంటున్నారు. అవేంటంటే  అబ్బాయిలలో సమయస్ఫూర్తి ఎక్కువగా ఉంటే అమ్మాయిలకి ఇష్టమంట ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమయస్ఫూర్తిగా సమస్యని పరిష్కరించే వాళ్ళని అమ్మాయిలు ఇష్టపడతారంట.
 

 అలాగే ఆత్మవిశ్వాసం ఉన్న అబ్బాయిలకి కూడా ఫ్లాట్ అయిపోతారంట అమ్మాయిలు. అబ్బాయి నడకలో మాటల్లో వ్యవహార శైలిలో కాన్ఫిడెన్స్  ని గమనిస్తూ ఉంటారంట అమ్మాయిలు. ఇక డ్రెస్సింగ్ స్టైల్ కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తారంట అమ్మాయిలు.
 

ఎలా పడితే అలా డ్రెస్సులు వేసుకునే అబ్బాయిల కన్నా  సమయానికి తగ్గట్టు డ్రెస్సులు వేసుకునే వారికే తమ ఓటు అంటున్నారు అమ్మాయిలు. ఇంకా మగవాళ్ళల్లో దయ జాలి వంటి వాటిని ఆశిస్తున్నారు అమ్మాయిలు. జీవితంలో ఏదైనా సాధించాలి అనే తపన ఉన్న అబ్బాయిల కోసం అమ్మాయిలు పడి చచ్చిపోతారంట.
 

జీవితంలో ఎదగాలి అనుకునే అబ్బాయికే ప్రయారిటీ ఇస్తుందట అమ్మాయి. ఇక ముఖ్యమైనది లక్షణం హాస్య చతురత అబ్బాయి తను సంతోషంగా ఉంటూ తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా సంతోషంగా ఉంచే అబ్బాయిలని తెగ ఇష్టపడతారంట అమ్మాయిలు. కాబట్టి అబ్బాయిలు ఈ లక్షణాలు మీలో ఉండేలా చూసుకోండి అసలే అమ్మాయిల కరువు ఎక్కువగా ఉంది.

Latest Videos

click me!