Relationship: భార్యాభర్తలు ఎప్పటికీ విడిపోకుండా ఉండాలా.. అయితే ఇలా చేయాలి?

First Published | Jul 4, 2023, 3:27 PM IST

Relationship: సందర్భాలు ఒకటే అయినా ఆలోచించే విధానం భార్యాభర్తలలో వేరుగా ఉంటుంది. అందుకే ఒకసారి ఎదుటి వ్యక్తి కోణంలో ఆలోచించి సమస్యని పరిష్కరించుకోవటం ఎలాగో చూద్దాం.
 

 స్త్రీ, పురుషుల ఆలోచన విధానంలో తేడా ఉంటుంది అంటున్నారు టొరెంట్ పరిశోధకులు అందుకే ఇద్దరి మధ్యన తేడాలు వస్తాయంట. భార్యాభర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం కానీ ఎవరిని ఎవరు అర్థం చేసుకోవాలన్నదే ఇక్కడ సమస్య.
 

 సమస్యలను అర్థం చేసుకొని నాకు అనుగుణంగా మారాలి అని భార్యాభర్త ఇద్దరు భావిస్తారు. అక్కడే కథలు సమస్య మొదలవుతుంది. ఓకే విషయానికి భార్యాభర్తలు స్పందించే విధానం వేరుగా ఉంటుంది. ఈ ఒక్క విషయం అర్థం చేసుకోగలిగితే చాలా కుటుంబాల్లో గొడవలు ఉండవు అంటున్నారు పరిశోధకులు.
 


సాధారణంగా స్త్రీలని కుటుంబ వ్యవహారాలు ఇబ్బందులకు గురిచేస్తాయట వారి గురించి ఎవరు ఎలా మాట్లాడుకున్నారు అనే విషయం ఆడవాళ్ళని ఎక్కువ బాధకి గురిచేస్తుంది కానీ ఇదే విషయం మగవాళ్ళు అస్సలు పట్టించుకోరంట.
 

వాళ్ళ ఆలోచన ఎప్పుడూ సంపాదన ఉద్యోగం ఇంటా బయటా వాళ్లకి దక్కే గౌరవం సమాజంలో తగిన ప్రాధాన్యత..దీని మీదనే ఎక్కువ కాన్సెంట్రేట్ చేస్తారంట. ఈ విషయంలో ఎలాంటి హెచ్చుతగ్గులు వచ్చినా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతారు పురుషులు.
 

డిప్రెషన్ స్త్రీ పురుషులకి ఒకేలాగా వస్తుంది కానీ మళ్ళీ ఎక్కడ కూడా స్పందించే విధానం పేరుగా ఉంటుంది డిప్రెషన్ కి గురైన స్త్రీలు నిరాశ నిస్పృహలతో  ఒంటరిగా ఉండడానికి  ఇష్టపడతారు తన భాగస్వామి నుంచి ఓదార్పుని ధైర్యాన్ని ఆశిస్తారు.
 

మగవారు మాత్రం అలా కాకుండా కోపం పంతం లాంటి లక్షణాలని కనపరుస్తారు. భార్యలు తమ సమస్యల్లో జోక్యం చేసుకోకుండా, తమకి సలహాలు ఇవ్వకుండా  ఉంటే బాగుండు అని ఆలోచిస్తారు. అలాగే మగ పిల్లల్లో టీనేజ్ నుంచే పగ ప్రతీకారం శత్రుత్వం వంటి లక్షణాలు కనబడతాయి.
 

 కాబట్టి వీరి ప్రవర్తనని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి అని మగపిల్లాడి తల్లిదండ్రులని హెచ్చరిస్తున్నారు టొరెంట్ శాస్త్రవేత్తలు. కొన్ని వందల మంది భార్యాభర్తల్లో సుదీర్ఘ కాలం పాటు చేసిన పరిశోధన ఫలితాలు ఇవి. కాబట్టి ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ఎవరికీ ఏది కావాలో అది ఇచ్చి మీకు ఏది కావాలో అది తీసుకొని మీ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి.

Latest Videos

click me!