ఈ మధ్యకాలంలో భార్యాభర్తల బంధం ఎక్కువ కాలం నిలబడి పడటం లేదని చాలా సున్నితంగా ఉంటున్నాయని అందుకే చిన్న చిన్న విషయాలకే విడాకుల వరకు వెళ్తున్నారని ఎక్కువగా వినిపిస్తున్న మాటలు. నిజానికి భార్యాభర్తలు పెద్ద పెద్ద సమస్యలను ఎంతో మెచ్యూరిటీతో అర్థం చేసుకుంటూ సాల్వ్ చేసుకుంటున్నారు.
కానీ చిన్న చిన్న విషయాల్లోనే వీరికి బేధాభిప్రాయాలు వస్తున్నాయి. ముఖ్యంగా వారికి లభించే గౌరవం విధేయత విషయంలో ఎవరు కాంప్రమైజ్ కావడం లేదు. పూర్వం రోజుల్లో ఆడవాళ్లు మగవాళ్ళకి విధేయతగా ఉంటే సరిపోయేది.
కానీ నేటి రోజుల్లో జెండర్ ఈక్వాలిటీ వచ్చిన తర్వాత ఆడవాళ్లు కూడా తగిన గౌరవాన్ని విధేయతని ఆశిస్తున్నారు. అందులో ఏమాత్రం లోపం వచ్చిన అవమానంగా ఫీల్ అవుతున్నారు కాబట్టి మగవాళ్ళు ఈ విషయం మీద దృష్టి పెట్టాలి. అలాగే మన పార్ట్నర్ మనకన్నా ఎక్కువ..
విధేయత పక్క వాళ్ళకి ఇవ్వటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు నేటి తరం వాళ్లు. నీ కన్నా నాకు ఎవరు ఎక్కువ కాదు అనే భరోసా దంపతులు ఇద్దరు ఒకరి నుంచి ఒకరు ఆశిస్తున్నారు. శాశ్వతమైన విజయవంతమైన సంబంధాన్ని ఏర్పరచడంలో విధేయత అత్యంత కీలకమైన అంశంగా మారింది.
కాబట్టి మీ విధేయతని మీ భాగస్వామిపై చూపించడానికి ప్రాధాన్యత ఇవ్వండి. మీ సంబంధంలో విశ్వాసపాత్రంగా ఉండకపోవటం వల్ల మీరు ఒత్తిడికి గురవుతారు మరియు మీ భాగస్వామి యొక్క నమ్మకాన్ని కూడా కోల్పోతారు కాబట్టి.
మీ భాగస్వామి దగ్గర మీ నమ్మకాన్ని విధేయతని కోల్పోకుండా చూసుకోవలసిన బాధ్యత మీదే. ఎప్పుడైతే మీ సహచరికి మీరు విధేయతని కనబరుస్తారో సహజంగానే వారు మీ పట్ల శ్రద్ధ విధేయత కనపరుస్తారని గుర్తుంచుకోండి.