Relationship: మీ భాగస్వామితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ మార్గాలు మీకోసమే?

First Published | Jul 3, 2023, 12:23 PM IST

Relationship: రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అలాగే ఇద్దరూ చొరవ చూపిస్తేనే బంధం నిలబడుతుంది. ఒకరి నిర్లిప్తత మరొకరి నిరాశకి కారణం కావచ్చు.ఆ కారణాలు వాటి పరిష్కారాలు ఏమిటో చూద్దాం.
 

పూర్వం ఒక సామెత ఉండేది రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అని. ఈ సామెత సంసారానికి చక్కగా సరిపోతుంది ఎందుకంటే ఒక సంసారం సజావుగా చాగాలంటే ఇద్దరు ప్రమేయం తప్పనిసరిగా ఉండాలి. అందులో ఏ ఒక్కరూ సరిగా లేకపోయినా  సంసార ప్రయాణం సరిగ్గా సాగదు అవేంటో చూద్దాం.
 

ఒక భార్య లేదా భర్త తన ఆఫీసు వ్యవహారాలని కానీ ఇంటి వ్యవహారాలను కానీ తన భాగస్వామితో షేర్ చేసుకోవాలనుకుంటుంది కానీ అవతలి వ్యక్తి వినటానికి ఇష్టపడకపోతే అది ఆమెలోని ఉత్సాహాన్ని చంపేస్తుంది. రేపటి రోజున తన కష్టసుఖాలని పంచుకోవడానికి వచ్చిన రోజున ఈమె ఆసక్తి చూపించకపోవచ్చు.
 


 ఇది బంధం బీటలు వారటానికి కారణం అవుతుంది. అలాగే శృంగారం సమయంలో కూడా ఒకరికి ఆసక్తి ఉన్నప్పుడు భాగస్వామి సహకారం లభించకపోతే అది తీవ్ర మనోవేదనకి గురిచేస్తుంది. బాధ కోపానికి కోపం బంధాన్ని ముక్కలు చేయడానికి కారణం అవుతుంది.
 

 కాబట్టి ఎదుటి వ్యక్తి యొక్క ఇష్ట ఇష్టాలని గమనిస్తూ ఒక్కొక్కసారి వారి ఇష్టాలు కూడా విలువని ఇవ్వటం ప్రారంభించండి అప్పుడు వారు కూడా మీకు విలువ ఇస్తారు. మీ భాగస్వామి మీతో గడపటానికి ఇంట్రెస్ట్ చూపించకుండా కేవలం తన ఫ్రెండ్స్ తో టైం గడపడాన్ని ఇష్టపడుతున్నట్లయితే మీ బంధాన్ని అతను లైట్ తీసుకుంటున్నట్లే లెక్క.
 

కానీ మీరు లైట్ తీసుకోకండి ఏం చేస్తే మీ కంపెనీని ఎంజాయ్ చేస్తారో ఆలోచించండి. కచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. తన కష్టసుఖాలని మీతో కాకుండా వేరే వాళ్ళతో పంచుకుంటున్నాడు అంటే ముందుగా కోప్పడకండి అందుకు గల కారణాలు అన్వేషించండి. నీతో కష్టసుఖాలు పంచుకునే అంత స్వేచ్ఛ స్వతంత్రం ఉన్నాయో లేదో గమనించండి.
 

లేదు అనిపిస్తే మాత్రం మీరే చొరవచేసి నీ మీద నమ్మకం కలిగేలాగా చేసుకోవలసిన బాధ్యత మీదే. చివరిగా ఒక విషయం సమస్య వచ్చాక పరిష్కరించుకునే కన్నా అసలు సమస్య రాకుండా జాగ్రత్త పడటం చాలా ఉత్తమం.

Latest Videos

click me!