మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నారా? ఇలా తెలుసుకోండి

First Published | Jul 3, 2023, 11:29 AM IST

మునపటిలా మీతో క్లోజ్ గా, ఆనందంగా ఉండకపోవడం, ఫోన్ కు పాస్ వర్డ్ లు కొత్తగా పెట్టడం, మీకు కాస్ట్లీ గిఫ్ట్ లు ఇవ్వడం వంటివి  మీ భాగస్వామి చేస్తున్నారా? అయితే డౌటే లేదు..
 

భాగస్వామిపై ఉన్న నమ్మకమే.. వారిని ఎన్ని తప్పులు చేసినా ఇంకా ఇంకా నమ్మేలా చేస్తుంది. కానీ ఇదే అలుసుగా తీసుకుని మోసం చేసే వారు కూడా ఉన్నారు. కానీ సంబంధంలో నమ్మకద్రోహం అసలే ఉండకూడదు. మీ భాగస్వామి ప్రవర్తనలో తేడా వస్తే మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నట్టే. దీన్ని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

ప్రవర్తనలో మార్పు

మీ భాగస్వామి ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పు వస్తే మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నట్టే లెక్క. అంటే రహస్యంగా, మీకు దూరంగా ఉంటే అనుమానించాల్సిందే. మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తే తమ రోజు వారి విషయాలను మునపటిలా మీతో చర్చించకపోవచ్చు. లేదా వారి ఆచూకీ గురించి అడిగితే వాటిని స్కిప్ చేస్తారు. ఇది నమ్మకద్రోహాన్ని సూచిస్తుంది.
 

Latest Videos


సర్ ప్రైజ్

మీ భాగస్వామి మీకు అకస్మాత్తుగా మీకు ఖరీదైన బహుమతులు, లేదా సర్ ప్రైజ్ లు ఇవ్వడం ప్రారంభిస్తే ఇలాగే చేస్తారు. ఇది అనుమానించాల్సిన విషయమే. 
 

గోప్యత పెరగడం

మోసం చేసే భాగస్వామి సేఫ్టీ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అంటే కొత్తగా వారి వస్తువులకు పాస్ వర్డ్ లు పెడతారు. లేదా అకస్మాత్తుగా వారి పాస్ వర్డ్ లను మార్చుతారు. వారి ఫోన్ ను మిమ్మల్ని ముట్టుకోనియరు. లేదా వారి సోషల్ మీడియా ఖాతాలను గోప్యంగా ఉంచుతారు. 
 

తక్కువగా మాట్లాడటం

ఎవరైనా మోసం చేస్తున్నప్పుడు వారు తమ భాగస్వామికి మానసికంగా దూరంగా ఉంటారు. కలిసి మాట్లాడుకోవడానికి ఇంట్రెస్ట్ చూపరు. లేదా ఆప్యాయత, సాన్నిహిత్యం పరంగా గ్యాప్ ను పెంచుతారు. 
 

ఇంటికి రాకపోవడం

వర్క్ వల్ల అప్పుడప్పుడు లేట్ అవ్వడం, ఇంటికి రాకపోవడం చాలా కామన్. కానీ ఇలా తరచుగా జరిగితే మాత్రం అది సాధారణ విషయం కాదు. అందులోనూ ఎందుకు లేట్ అయ్యిందో చెప్పకపోవడం, అడిగినందుకు గొడవ పడటం, సమాధానం చెప్పడంలో తత్తరపాటు వంటివి మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేసే సంకేతాలే. అంతేకాదు వీళ్లు సాకులు ఎక్కువగా చెప్తారు కూడా. 
 

లైంగిక సాన్నిహిత్యం  తగ్గడం

లైంగిక సాన్నిహిత్యంపై బాగా తగ్గితే కూడా అనుమానించాల్సిందే. నమ్మకద్రోహం చేసేవారు మీకు సెక్స్ పరంగా దూరంగా ఉంటారు. ఇది నమ్మకద్రోహాన్ని సూచిస్తుంది. వారు తమ అవసరాలను మరెక్కడైనా తీర్చుకోవచ్చు లేదా మరొకరితో భావోద్వేగ లేదా శారీరక ప్రమేయం కారణంగా ఆసక్తిని కోల్పోవచ్చు.

click me!