Relationship: దంపతుల మధ్య దూరాన్ని పెంచే ఆఫీస్ పని వేళలు.. అశ్రద్ధ చేస్తే మరింత అగాధం?

First Published | Jul 3, 2023, 11:25 AM IST

Relationship: నేటి తరంలో మామూలుగానే బంధాలు పల్చబడి పోతున్నాయి. ఆ బంధాలని మరింత దూరం చేస్తున్నాయి ఆఫీసు పని వేళలు. షిఫ్ట్ డ్యూటీస్ బంధాన్ని ఎలా పలుచని చేస్తుందో.. తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో చూద్దాం.
 

 నేటి తరంలో మానవ సంబంధాలు ఎలా ఉన్నాయో మనం ప్రత్యేకించి మాట్లాడుకో అక్కర్లేదు అందులోని భార్యాభర్తల బంధానికి విలువ లేకుండా పోయింది. చిన్న చిన్న విషయాలకే విడాకుల వరకు వెళ్ళిపోతున్నారు దంపతులు. అలాంటి బంధాన్ని మరింత పలుచన చేస్తుంది ఆఫీస్ పని వేళలు. మీరు వింటున్నది నిజమేనండి ఆఫీసు పనివాళ్లని కూడా ఒక బంధాన్ని మరింత దూరం చేస్తుంది. అది ఎలాగో చూద్దాం.
 

ఈ రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరూ పనిచేయకపోతే ఇల్లు గడవని పరిస్థితి. కొన్ని కంపెనీలలో షిఫ్ట్ డ్యూటీలో ఉండటం వల్ల భార్య మార్నింగ్ డ్యూటీకి వెళ్తే భర్త నైట్ డ్యూటీకి వెళ్లవలసిన అవసరం ఏర్పడుతుంది అలాంటి సమయంలో ఇద్దరు కలిసి కూర్చొని కష్టసుఖాలు మాట్లాడుకునే సమయం లేకపోతుంది.
 


అంటే ఇక్కడ భార్యాభర్తల మధ్య అనురాగం లేదు అని కాదు ఇక్కడ లేనిది సమయం మాత్రమే. ఒకరు బాధలో ఉన్నప్పుడు పక్కవారికి వారిని ఓదార్చాలని ధైర్యాన్ని ఇవ్వాలని అలాగే వారు అనారోగ్యానికి గురైనప్పుడు పక్కనే ఉండి సేవలు చేయాలని ఏ భాగస్వామి అయినా అనుకుంటుంది.
 

కానీ తప్పనిసరి పరిస్థితులలో ఆఫీస్ కి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. అప్పుడు ఒకరి కోసం ఒకరు ఏమీ చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది ఆ పరిస్థితులలో నుంచే చిరాకులు కోపాలు మొదలవుతాయి. ఇలాంటి సందర్భాలలో ఏమాత్రం అశ్రద్ధ వహించినా ఇద్దరి మధ్య ఉన్న దూరం  అగాధంగా మారుతుంది.
 

అందుకే కొంచెం శ్రద్ధ పెట్టండి. మీ భాగస్వామి శారీరకంగా గాని మానసికంగా గాని మీ అవసరం ఉంది అనిపించినప్పుడు వీలైతే ఆఫీస్ కి సెలవు పెట్టండి. కనీసం రెండు మూడు నెలలకి ఒకసారి అయినా ఇద్దరు కలిపి బయటికి వెళ్లడానికి ప్రయత్నించండి. ఇలా చేయటం వలన మీ కష్టసుఖాలు ఒకరితో ఒకరు పంచుకొని మీ మధ్యన ఉన్న ఒత్తిడి తగ్గుతుంది.
 

ఒకరికి ఒకరు ఎదుటివారికి సమస్యని తొలగించే సలహాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అది బంధాన్ని మరింత పెంచుతుంది. ఆఫీసు డ్యూటీలు మీ బంధానికి అడ్డంకిగా ఉంటే షిఫ్ట్ టైం మార్చుకునే ప్రయత్నం చేయండి. లేదంటే జాబ్ మారే ప్రయత్నం చేయండి ఎందుకంటే జాబ్ కన్నా జీవిత భాగస్వామి ముఖ్యం.

Latest Videos

click me!