Relationship: భార్యాభర్తలలో ఈ లక్షణాలు ఉన్నాయా.. అయితే కలిసి కాపురం చేయటం కష్టమే!

First Published | Sep 14, 2023, 3:02 PM IST

 Relationship: అన్ని బంధాలలో కెల్లా ఆలుమగల బంధం ఎంతో ప్రత్యేకమైనది. ఈ బంధాన్ని నిలబెట్టుకోవడం నిజంగా అంత సులువైన పని ఏమీ కాదు. అయితే భార్యాభర్తలలో ఇలాంటి లక్షణాలు ఉంటే ఆ కాపురం సజావుగా సాగదు అంటున్నారు నిపుణులు. అదేంటో ఇక్కడ చూద్దాం.
 

 సాధారణంగా సంసారంలో అలకలు,గొడవలు జరుగుతూనే ఉంటాయి. అయితే కాస్త సమయం తర్వాత అవి మామూలు స్థితికి వచ్చేస్తాయి. అలా కాకుండా జరిగిన గొడవనే పదేపదే పట్టుకుని వేలాడుతూ భాగస్వామితో మళ్ళీ గొడవకి దిగుతూ ఉంటారు చాలామంది. ఇది అంత మంచి పద్ధతి కాదు.
 

 అలాగే భార్యాభర్తలలో ఉండే చాలా లక్షణాలు కాపురాన్ని సజావుగా సాగనివ్వవు. ఆ లక్షణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. సాధారణంగా పెళ్లయిన కొన్ని నెలల గడువు సమయంలో ఒకరిని గురించి ఒకరు అర్థం చేసుకుని అన్యోన్యంగా ఉంటాయి చాలా జంటలు.
 


 అయితే ఎన్ని సంవత్సరాలయినప్పటికీ ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోకుండా, అసలు ఒకరి విషయాలు ఒకరు తెలుసుకోకుండా ఉన్నారు అంటే అలాంటి సంసారం నిజంగా నరకమే. అలాగే భర్త ఇంటికి వచ్చేసరికి భార్య సంతోషంగా ఎదురు వెళ్తే బాగుంటుంది.
 

 అంతేకానీ మొఖం ముడుచుకొని అలకపాన్పు ఎక్కి కూర్చుంటే ఆ మగవాడికి కోపం నషాలానికి ఎక్కుతుంది. ఆ సంసారం మీద చిరాకు పుడుతుంది. అలాగే ఆఫీస్ టెన్షన్ అంతా తీసుకువచ్చి భార్య మీద చూపించే భర్తలను భరించడం కూడా కష్టమే. ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు జరిగితే పరవాలేదు.
 

 కానీ ఇదే రొటీన్ గా ప్రతిరోజు జరిగిందంటే మాత్రం అలాంటి కాపురాన్ని చేయడం కష్టమే. అలాగే భాగస్వామిని చులకన చేస్తూ తన గురించి తాను గొప్పగా చెప్పుకునే భాగస్వామిని భరించడం కూడా చాలా కష్టం. భాగస్వామి కష్టంలో ఉన్నప్పుడు నేనున్నానని ధైర్యం చెప్పకుండా నిర్లక్ష్యం చేసే వ్యక్తితో కాపురం కూడా చాలా కష్టం.
 

ఎందుకంటే కష్టంలో తోడురాని భాగస్వామి మరే విధంగానూ నీకు ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వలేరు. కాబట్టి ఇలాంటి లక్షణాలు దంపతులలో ఎవరి మధ్యనైనా ఉంటే ముందుగా మార్చుకోవటానికి ప్రయత్నించండి. ఫలితం లేదు అనుకున్నప్పుడు ఇద్దరూ కూర్చొని ఒక నిర్ణయానికి రావడం మంచిది.

Latest Videos

click me!