Relationship: మీ భాగస్వామిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త!

First Published | Sep 12, 2023, 4:00 PM IST

 Relationship: కొన్ని బంధాలు అనుబంధాల మీద నిర్మించబడతాయి. కానీ కొన్ని బంధాలు స్వార్థాల కోసం నిర్మించబడతాయి. చాలామంది తెలియక ఆ ఊబిలో కూరుకుపోతారు. అయితే మీ భాగస్వామి లో ఈ లక్షణాలు కనబడుతున్నట్లయితే జాగ్రత్త పడండి. ఆ లక్షణాలు ఏంటో ఇక్కడ చూద్దాం.
 

 సాధారణంగా అమ్మాయిలైనా, అబ్బాయిలైనా రిలేషన్ లో ఉండేటప్పుడు ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉండాలి. ఆచి తూచి అడుగేస్తూ ఉండాలి. కొన్ని బంధాలు ప్రేమతో ఏర్పడితే కొన్ని బంధాలు మాత్రం స్వార్థం కోసం ఏర్పడతాయి. అందుకే మీ భాగస్వామిలో ఈ లక్షణాలు ఉన్నాయేమో గమనించండి.
 

 సాధారణంగా మీ బంధాన్ని కోరుకునే వ్యక్తి నీ గురించి మాత్రమే మాట్లాడుతాడు. కానీ కొంతమంది అస్తమానం తమ మాజీ ప్రేమికుల గురించి మాట్లాడుతూ ఉన్నట్లయితే మీరు మీ భాగస్వామి గురించి ఆలోచించవలసిందే. వారు మీ మీద ప్రేమతో రిలేషన్ ఏర్పరుచుకున్నారా..
 


 లేదంటే తమ మాజీ ప్రేమికులని అసూయ పడేలా చేయటం కోసం మీతో రిలేషన్ ఏర్పరచుకున్నారో నిర్ధారించుకోవాలి. అలాగే మిమ్మల్ని తన మాజీ ప్రేమికులు ముందు పదేపదే తిప్పుతున్నట్లయితే మీ భాగస్వామిలో నిజమైన ప్రేమ లేదు. కేవలం మాజీ ప్రేయసిని రెచ్చగొట్టడం కోసం చేసే పనులు ఇవి.
 

 ఇలాంటి భాగస్వామి ఎప్పుడైనా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోవచ్చు కాబట్టి జాగ్రత్త పడండి. అలాగే మీ ముందు పదేపదే తమ మాజీ ప్రేమికుల గురించి మాట్లాడుతున్నట్లయితే అది కూడా ఆలోచించవలసిన విషయమే. వారు మీతో సంబంధాన్ని కేవలం వారి జీవితంలో ఖాళీని పూరించుకోవటానికి మాత్రమే చేస్తున్న పని ఇది.
 

అంతేకానీ మనస్ఫూర్తిగా మీతో బంధాన్ని కొనసాగించడం లేదని గుర్తించండి. అలాగే మిమ్మల్ని మాజీ ప్రేమికులతో పోలుస్తూ మాట్లాడుతున్నట్లయితే వారు కూడా ప్రమాదకరమైన మనుషులే. అలాగే మీ ఇష్టాలకి మీ అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా తమ మాజీ ప్రేమికులని దృష్టిలో పెట్టుకొని..
 

 కేవలం తను ఏదైతే చేయాలనుకుంటున్నారో అది మాత్రమే చేస్తూ ఇటు మిమ్మల్ని అటు మాజీ ప్రేమికులని ఇబ్బంది పెడుతున్న వ్యక్తులని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దూరం పెట్టడం ఉత్తమం. ఇలాంటి వ్యక్తులు భవిష్యత్తులోనైనా మనల్ని ముంచేసి వెళ్లిపోయే వారే. కాబట్టి ముందే జాగ్రత్త పడండి.

Latest Videos

click me!