మీ సెక్స్ లైఫ్ బోరింగ్ గా ఉందా? అయితే ఈ చిట్కాలు మీకోసమే..!

First Published | Sep 11, 2023, 11:39 AM IST

రిలేషన్ షిప్ లో కూడా కొందరికి బోర్ కొడుతుంది. ఇది సహజం. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే మీ లైంగిక జీవితం ఇక నుంచి అస్సలు బోర్ కొట్టదు. ఇందుకోసం ఏం చేయాలంటే? 
 

మారుతున్న జీవనశైలి, పనులు, బాధ్యతల వల్ల దంపతుల లైంగిక జీవితం సాఫీగా సాగదు. ఇది వాళ్ల ఆలోచనలు, ప్రవర్తనలో మార్పునకు కారణమవుతుంది. దీనివల్ల సంబంధాలలో ఒత్తిడి పెరుగుతుంది. అలాగే ఇద్దరిలో లిబిడో  తగ్గుతుంది. ఇంకేముందు రిలేషన్ షిప్ బోరింగ్ గా అనిపస్తుంది. అయితే కొన్ని టిప్స్ ను పాటిస్తే మీ లైంగిక జీవితంగా మెరుగ్గా సాగుతుందని నిపుణులు చెబుతున్నారు.
 

relationship and intimacy coach Yasmin ప్రకారం.. కలిసి పడుకోవడం లేదా ఒకే చోట ఉన్నంత మాత్రానా మీరు మధ్య సాన్నిహిత్యం ఉన్నట్టు కాదు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, ఒకరి మాటలను మరొకరు వినడం, ఇద్దరి మానసిక స్థితిని అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. లైంగికంగా చురుగ్గా లేకపోవడం వల్ల మీ ఇద్దరికీ ఎన్నో శారీరక సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. లైంగికంగా చురుగ్గా ఉండే వ్యక్తులకు అధిక రక్తపోటు, బలహీనమైన రోగనిరోధక శక్తి, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అంతేకాదు నిద్రలేమి, మానసిక ఒత్తిడి నుంచి కూడా బయటపడతారు. మరి మీ లైంగిక జీవితం మెరుగ్గా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 


కలిసి సినిమాలు చూడండి

ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, మీ సెక్స్ డ్రైవ్ ను పెంచడానికి కలిసి కొంత సమయం గడపడం చాలా ముఖ్యం. లైంగిక జీవితాన్ని పెంపొందించడానికి సన్నిహిత సినిమాలు కలిసి చూడడం, పుస్తకాలను చదవడం వంటివి చేయండి. ఇది మీ జ్ఞానాన్ని పెంచడమే కాకుండా ఒకరిపై ఒకరికి ప్రేమను రెట్టింపు చేస్తుంది. అనుబంధాన్ని పెంచుతుంది. 
 

ఇష్టాఇష్టాలు 

పడకగదికి వెళ్లే ముందు మీరు మానసికంగా కూడా సిద్ధంగా ఉండటం కూడా ముఖ్యమే. అలాగే మీ లుక్స్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఇది మీ లైంగిక జీవితాన్ని ఉత్తేజకరంగా, ఆహ్లాదకరంగా చేస్తుంది. మీ భాగస్వామి మీరు ఎలా రెడీ అయితే ఇష్టపడతారో తెలుసుకోండి. మీ భాగస్వామికి నచ్చే విధంగా రెడీ అవ్వండి. సెక్స్ అప్పీల్ ను పెంచడంలో మీ లుక్స్ ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. దీనితో పాటుగా పరిశుభ్రతను కూడా పాటించాలి. 

సెక్స్ సంభాషణను ఆస్వాదించండి

లైంగిక జీవితాన్ని ఆరోగ్యంగా, ఉద్వేగభరితంగా మార్చడానికి సెక్స్ సంభాషణ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే మీరు మీ ఇష్టాలను, సౌకర్యాన్ని భాగస్వామికి నిర్మొహమాటంగా చెప్పండి. ఇది మీ లైంగిక ఆనందాన్ని పెంచుతుంది. సెక్స్ సమయంలో పరస్పర చర్య సంబంధంలో కనెక్షన్ , మంచి అవగాహనను పెంచుతుంది. ఇది మిమ్మల్ని మీ భాగస్వామికి దగ్గర చేస్తుంది. అలాగే వైవాహిక జీవితాన్ని సంతోషంగా ఉంచుతుంది.
 

మీ భాగస్వామిని ప్రశంసించండి

ప్రతి ఒక్కరూ ప్రశంసలను ఇష్టపడతారు. ఇది సెక్స్ సమయంలో భావప్రాప్తి స్థాయిని పెంచుతుంది. అందుకే మీ భాగస్వామికి ప్రత్యేకమైన అనుభూతిని కలిగించడానికి కాంప్లిమెంట్స్ ను ఇవ్వడం మర్చిపోకండి. ఇది పడకగదిలో మీ బంధాన్ని బలోపేతం చేస్తుంది. శృంగారం తర్వాత కూడా భాగస్వామిని సంతోషంగా ఉండేలా చూడండి. 
 

ఫోర్ ప్లే మిస్ కావద్దు

శృంగారంతో మీ ఆనందం పెరగాలంటే ముందు ఫోర్ ప్లే లో పాల్గొనండి. ఇది మీ ఇద్దరూ భావప్రాప్తి పొందడానికి సహాయపడుతుంది. అంతేకాదు లైంగికంగా కూడా చురుగ్గా ఉంటారు. మీ భాగస్వామిని కూడా సంతృప్తిపరచగలుగుతారు. కొంతమంది ఫోర్ ప్లే ను మిస్ అవుతారు. దీనివల్ల సెక్స్ ఆహ్లాదకరంగా ఉండదు. సెక్స్ సామర్థ్యాన్ని పెంచడానికి ముందు ఫోర్ ప్లే లో పాల్గొనండి. 
 

ముద్దు 

ముద్దు ఎన్నో భావాలను వ్యక్తపరుస్తుంది. ఇది మిమ్మల్ని మీ భాగస్వామికి మరింత దగ్గర చేస్తుంది. అలాగే మీ ప్రేమను వ్యక్తపరుస్తుంది. ఒక చిన్న ముద్దు మీ లైంగిక జీవితాన్ని ఆరోగ్యంగా, శక్తివంతంగా మర్చడానికి కూడా పనిచేస్తుంది. ముద్దు మీ శరీరంలో లిబిడోను పెంచుతుంది. అలాగే మిమ్మల్ని  మీ భాగస్వామికి దగ్గర చేయడానికి సహాయపడుతుంది. 

Latest Videos

click me!