ఆడవాళ్ల నుంచి మగవారు కోరుకునేది ఇదే..!

First Published | Sep 4, 2023, 11:26 AM IST

కాబోయే భర్త ఇలా ఉండాలి? అలా ఉండాలి? అని అమ్మాయిలు పక్కాగా అనుకుంటారు. అంతెందుకు నన్ను అర్థం చేసుకునేవాడే రావాలి? నాకోసం ఇది చేయాలి? అది చేయాలని అమ్మాయిలు అనుకుంటారు. ఇకపోతే మరి అబ్బాయిలు అమ్మాయిల నుంచి ఏం ఆశిస్తారో తెలుసా?
 

ఆడవాళ్లు ఏం చేస్తే సంతోషంగా ఉంటారు? వారిని సంతోషపెట్టే మార్గాల గురించి మనం వివిధ వ్యాసాల్లో చదువుతూనే ఉంటాం. మరి ఆడవారి నుంచి పురుషులు ఏం కోరుకుంటారో మీకు తెలుసా? ఇలా తెలుసుకునేవారు చాలా తక్కువే. నిజమేంటంటే.. ఆడవాళ్ల మాదిరిగానే మగవారు కూడా ఆడవాళ్ల నుంచి కొన్ని కొన్ని ఆశిస్తారు. అలాంటివి జరగకపోతే ఎంతో బాధపడుతారు.
 

మన మాట వినాలి. అర్థం చేసుకోవాలి వంటి ఎన్నో విషయాలను కూడా మగవారు ఆడవాళ్ల నుంచి ఆశిస్తారట. కానీ ఇతని ఫీలింగ్స్ ఏంటి? అతని కోరికలేంటి ఇలా తెలుసుకునేవారు చాలా తక్కువ మందే ఉంటారు. బయటి నుంచి ఎలా ఉన్నా నిజానికి తన భాగస్వామిపై ఎన్నో ఆశలు పెట్టుకుంటార మగవారు. నిజానికి పురుషులు తమ భావాలను వ్యక్తపరచరు. కానీ వారు కూడా ఆడవాళ్ల లాగే భాగస్వామిపై ఎన్నో అంచనాలు పెట్టుకుంటారట. మరి పురుషులు స్త్రీల నుంచి ఎలాంటివి ఆశిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..
 

Latest Videos


అవగాహన, గౌరవం

భాగస్వామి తనను గౌరవించాలని, అర్థం చేసుకోవాలని పురుషులు కూడా కోరుకుంటారు. అయితే వారు మీకు ఈ విషయం చెప్పకపోవచ్చు. కానీ మీ భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వారిని గౌరవించండి. ఎప్పటికప్పుడు ప్రశంసించండి. మీ మద్దతును తెలియజేయండి. మీ భాగస్వామి నిర్ణయాలను మీరు గౌరవిస్తారని వారికి అర్థమయ్యేట్టు చేయండి. కష్ట సమయాల్లో అతడు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు.. దానికి మీ మద్దతునివ్వండి. అండగా ఉండండి. 

పురుషుల రహస్యాలు

ఆడవారికి బాధగా అనిపించినప్పుడు ఏడుస్తారు. కోపంగా ఉన్నప్పుడు తిడతారు, ఏడుస్తారు. ఆడవాళ్లు తమ భావోద్వేగాలను చాలా సులువుగా వ్యక్తపరుస్తారు. ఏమోషన్స్ ను తీర్చుకుంటారు. కానీ పురుషులు ఇలా ఉండరు. మగవారు ఏడవకూడదు అనే నిబంధన ఈ సమాజంలో బలంగా ఉంది. ఏవరైనా ఏడిస్తే ఆడవాళ్లలా ఏడుస్తున్నాడని వెక్కిరిస్తారు. అందుకే పురుషులకు ఎంతటి కష్టం వచ్చినా.. చుక్క కన్నీరు కూడా కార్చరు.  వారికీ ఏడవాలని ఉంటుంది.. కానీ ఎవరు ఏమంటారోనని జంకుతారు. అయితే వచ్చే భాగస్వామి తన భావోద్వేగాలను అర్థం చేసుకోవడమే కాకుండా వాటిని మెచ్చుకోవాలని పురుషులు ఆశిస్తారట.
 

ప్రోత్సాహం

భాగస్వామి మీకు అండ దండగా ఉండాలని ఆడవారు కోరుకున్నట్టే మగవారు కూడా ఆడవాళ్ల నుంచి ఇది కోరకుంటారు. అతని వ్యక్తిగత లేదా వృత్తి జీవితానికి సంబంధించిన విషయాలలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీ ప్రోత్సాహం ఉండాలని అనుకుంటారు. ఇది వారి మనోధైర్యాన్ని పెంచుతుంది. అందుకే అతడికి సపోర్ట్ చేయండి. అతని మంచి, చెడు నిర్ణయాలలో మీరు అతనితో ఉన్నారని ధైర్యం కల్పించండి. వారిలాగే మీరు కూడా వారిని అడుగడుగునా  ప్రోత్సహించాలి. అండగా ఉండండి. 
 

స్వేచ్ఛ, ప్రేమ

పురుషులు కూడా తమ భాగస్వామి నుంచి స్వేచ్ఛను, ప్రేమను పొందాలని ఆశిస్తారు. ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటే వారికి చిరాగ్గా అనిపిస్తుంది. ఇది వారికి స్వేచ్ఛ లేకుండా చేస్తుంది. అలాగే మీ భాగస్వామికి పర్సనల్ స్పేస్ ఇవ్వాలి. దీని అర్థం మీరు అతన్ని పూర్తిగా మర్చిపోవాలని కాదు. కానీ మీరు ఎప్పటికప్పుడు అతనిపై మీ ప్రేమను తెలియజేస్తూ ఉండాలి. రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు మీరు ఒక బృందం లాగా పనిచేయాలి. 
 

నిజాయితీతో కూడిన సంబంధం

మిమ్మల్ని అర్థం చేసుకోలేని వారితో గడపడం చాలా కష్టం. ఒక మనిషికి కావాల్సింది అర్థం చేసుకోవడం. స్పష్టమైన, నిజాయితీతో కూడిన కమ్యూనికేషన్ మీ బంధాన్ని బలపరుస్తుంది. అందుకే మీ భాగస్వామితో మీ ప్రతి ఆలోచనను, భావాలను ఎలాంటి సంకోచం లేకుండా పంచుకోండి. దీంతో వారికి మీపై పూర్తి విశ్వాసం ఉంటుంది. 
 

click me!