ఏ రిలేషన్ షిప్ అయినా సరే పర్ఫెక్ట్ గా ఉండదు. ప్రతి సంబంధంలో ఏదో లోపం ఉంటుంది. కానీ దాన్ని స్వీకరించినప్పుడే మీ బంధం సాఫీగా సాగుతుంది. ఏ రిలేషన్ షిప్ అయినా సరే బాగుండాలంటే పార్టనర్ పై గౌరవం, ప్రేమ ఉండటం చాలా ముఖ్యం. అయితే మీరు చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఆ బంధం విడిపోయే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ తమ భాగస్వామిపై చాలా ఆశలు పెట్టుకుంటారు. కాబట్టి జంటలు తమ భాగస్వామి నుండి ఏమి కోరుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
పర్సనల్ స్పేస్
ఏ రిలేషన్షిప్ లోనైనా సరే పర్సనల్ స్పేస్ చాలా చాలా ముఖ్యం. ప్రేమించుకునేవారు ప్రతీది పంచుకుంటారు. కానీ ఇది ఉన్నప్పటికీ.. వారు వారి జీవితంలో కొంచెం పర్సనల్ స్పేస్ ను కోరుకుంటారు. దీనర్థం వారికి పర్సనల్ స్పేస్ ఇవ్వడం వల్ల సంబంధంలో దూరం వస్తుందని మాత్రం కాదు. కానీ ఇది మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
అన్నీ పంచుకోవాల్సిన అవసరం లేదు
మీ రిలేషన్ షిప్ సంతోషంగా సాగడానికి ఒకరితో ఒకరు విషయాలను పంచుకోవడం ఎంతో ముఖ్యం. కానీ ఒకరి గోప్యతను మరొకరు చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. మీరు మీ భాగస్వామితో ప్రతిదీ పంచుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంది తమ ప్రతిదీ పంచుకోవడానికి ఇష్టపడరు. కాబట్టి నిర్ణయాన్ని గౌరవించాలి.
పాస్ వర్డ్ లను చెప్పడం
మీ బంధం బలపడాలంటే మొబైల్, సోషల్ మీడియా పాస్ వర్డ్ ను షేర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మీ భాగస్వామిని నమ్మితే మొబైల్ లేదా సోషల్ మీడియా పాస్వర్డ్ లను అడగకండి.
వ్యక్తిగత నిర్ణయాలు
ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీ భాగస్వామిని ఖచ్చితంగా అడగాల్సిన అవసరం లేదు. లేదా మీ భాగస్వామిని అడిగే ప్రతిదీ చేయాల్సిన అవసరం లేదు. రిలేషన్ షిప్ లో వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే హక్కు కూడా ఉండాలి.
భాగస్వామి స్నేహితులను అంగీకరించడం
మీ భాగస్వామి స్నేహితులు అబ్బాయి లేదా అమ్మాయి కూడా కావొచ్చు. మీరు దానిని అంగీకరించాలి. రిలేషన్ షిప్ లో నమ్మకం, ఆలోచనల ఓపెన్ నెస్ చాలా ముఖ్యం.