సాధారణంగా మగవాళ్ళు చాలా క్యాజువల్ గా ఉంటారు. తమ పని తాము చేసుకుంటూ పోతారు. ప్రతి చిన్న విషయం మీద లోతుగా అబ్జర్వేషన్ పెట్టరు. అలాగే ప్రతి చిన్న విషయానికి ఆడవాళ్ళలాగా మనసు పాడు చేసుకుని ఎదుటి వాళ్ళని డిస్టర్బ్ చేయరు, అసలు దాని గురించి డిస్కస్ కూడా చేయరు.
అలాగే ప్రతి మగవాడు ఆడవాళ్ళు తనకి గౌరవం ఇవ్వాలి అనుకుంటాడు. అలాగే తన భాగస్వామి చిన్న పనికి పొగిడినా కూడా మగవాళ్ళు పడిపోతారు. వారు తదుపరి అభినందన కోసం అవసరమైన పనులన్నీ చేయడం ప్రారంభిస్తారు. అందుకే "ఆడదాని ఓర చూపులో జగన ఓడిపోని ధీరుడెవ్వడు" అని ఒక కవి గారు ఎప్పుడో చెప్పారు. అలాగే మగవాళ్ళు ఆడవాళ్ళ లాగా పనికిమాలిన విషయాలకు వివాదాలు పెట్టుకోరు.
విశేషమేమంటే కొన్నిసార్లు తన భార్య తనతో ఎందుకు పోట్లాడుతుందో కూడా వారికి తెలియదు. అవసరం అనుకుంటే తప్ప మగవాళ్ళు చిన్న చిన్న విషయాలపై దృష్టి పెట్టరు. అలాగే పురుషులు ఒప్పుకోరు కానీ వాళ్ళు ప్రతి స్త్రీని చూస్తారు. వారి రూపాన్ని బట్టి వారికి విలువ ఇస్తారు.
ఎవరైనా నచ్చితే వాళ్ల వ్యక్తిగతం గురించి తెలుసుకోవాలనుకుంటారు. తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారు కూడా. అలాగే మగవాళ్ళు కూడా ఆడవాళ్ళలాగే చాలా విషయాలకు భయపడతారు కానీ దానిని వ్యక్తం చేయరు. ఎందుకంటే ఏ మగవాడు తను బలహీనుడును అని చెప్పుకోవటానికి ఇష్టపడడు.
సమాజం ముందు తమని తాము ధైర్యవంతులుగా నిరూపించుకోవడానికి అవసరమైన పనులన్నీ చేస్తారు. అలాగే ప్రతి మనిషికి తన భాగస్వామి నుండి భావోద్వేగ మద్దతు అవసరం కానీ మగవారు దానిని వినరు, అలాగే బహిరంగంగా చర్చించటానికి ఇష్టపడరు. కానీ లోన మాత్రం వాళ్లు భాగస్వామి చేత ప్రేమించబడాలని కోరుకుంటారు. వీటితోపాటు చాలా విషయాలని పురుషుడు సమాజంతో చర్చించటానికి ఇష్టపడడు.
అందుకు కారణం సమాజం ముందు తను చిన్న చూపు చూస్తుందేమో అనే భయం. మగవాడు ఎప్పుడూ భయపడకూడదని కన్నీరు పెట్టకూడదని,అలాంటి వాళ్ళు మగవాళ్ళు కాదు అనే ఒక అపోహ మన దేశంలో నాటుకు పోయింది. ప్రస్తుతం మగవాళ్ళు ప్రవర్తనకి ఈ అపోహ కూడా ఒక కారణం.