Relationship: పెళ్లి కోసం ప్రపోజల్ చేస్తున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!

First Published | Oct 17, 2023, 11:49 AM IST

Relationship: ఈ రోజులలో చాలామంది లవ్ మ్యారేజ్ ప్రిఫర్ చేస్తున్నారు. అదేవిధంగా మీరు కూడా మ్యారేజ్  ప్రపోజల్ చేయాలనుకునేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
 

 పెళ్లి అనేది జీవితంలో ఒక మరపురాని సంఘటన.  ప్రతి ఒక్కరూ పెళ్లి అనేదాన్ని చాలా ప్రత్యేకంగా చేసుకోవాలి అనుకుంటారు. పెళ్లిని అందంగా మార్చుకోవడానికి ముందు ప్రపోజల్ ని అందంగా ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ ప్రపోజల్ ఎగ్జిట్మెంట్లో చాలామంది వాళ్లకి తెలియకుండానే తప్పులు చేస్తూ ఉంటారు.
 

అందుకే ఎవరినైనా పెళ్లి కోసం ప్రపోజల్ పెట్టేముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. మీకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లికి ప్రపోజల్ చేయాలనుకునేటప్పుడు ముక్కుసూటిగా ఒక్క ముక్కతో తేల్చేయకండి. అందులో కాస్త రొమాన్స్ ఫ్లేవర్ జోడించండి. ఎందుకంటే మ్యారేజ్ ప్రపోజల్ సాదాసీదాగా ఉండాలని ఎవరూ కోరుకోరు.
 


అలాగే ప్రపోజల్ గురించి పదిమందికి చెప్పి హడావిడి చేయకండి. ఎందుకంటే అవతలి వ్యక్తికి అది తెలిసే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ప్రపోజల్ లో ఉండే సర్ప్రైజ్ ఎలిమెంట్ మిస్ అవుతుంది. అలాగే ప్రపోజ్ చేసేటప్పుడు ఎదుటి వాళ్ళు ఫీలింగ్స్ కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్.
 

అసలు ఎదుటి వ్యక్తికి మీ మీద ఎలాంటి అభిప్రాయం ఉంది, తనకి మీ మీద పాజిటివ్ కార్నర్ ఉందా, ఇలాంటి విషయాలు అన్నీ ముందుగానే తెలుసుకోండి.ఏమి తెలుసుకోకుండా మ్యారేజ్ ప్రపోజల్ పెడితే రిజల్ట్స్ నెగటివ్ గా వచ్చే ప్రమాదం ఉంది.

అలాగే ప్రపోజ్ చేయడానికి టైం కూడా కరెక్ట్ గా ఉండాలి. ఎందుకంటే ప్రియురాలు మూడ్ సరిగ్గా లేనప్పుడు, లేదంటే ఏదైనా ఒత్తిడి ఆందోళనలో ఉన్నప్పుడు ఆమె ముందు మ్యారేజ్ ప్రపోజల్ పెడితే నెగిటివ్ రిజల్ట్స్  రావచ్చు. కాబట్టి జాగ్రత్త పడండి. అవతలి వాళ్ళ మనోభావాలు చూసుకొని అప్పుడు ప్రపోజ్ చేయండి.

అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మంచి ప్లేస్. నిజమేనండి మ్యారేజ్ ప్రపోజల్ చేసేటప్పుడు ఏ సినిమా హాల్లోనో, ఏ నాలుగు రోడ్ల జంక్షన్ లోనో చేస్తే అసహ్యంగా ఉంటుంది. వీలైనంతవరకు మీ ఇద్దరూ ఉన్నప్పుడు, అలాగే మన చుట్టూ ఉండే వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు లో ప్రపోజల్ చేస్తే మీ ప్రపోజల్ సక్సెస్ అవుతుంది.

Latest Videos

click me!