సెక్స్ సమయంలో త్వరగా అలసిపోతున్నారా? వీటిని తినండి మీ సెక్స్ స్టామినా పెరుగుతుంది

First Published | Oct 17, 2023, 12:58 PM IST

పోషకాల లోపం, మారుతున్న జీవనశైలి అలవాట్లు కూడా మీ సెక్స్ స్టామినాను తగ్గిస్తాయి. ఇలాంటి వారు చాలా సార్లు మందులను కూడా వాడుతుంటారు. అయితే కొన్ని ఆహారాలను తిన్నా గాని మీ సెక్స్ స్టామినా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

సెక్స్ మీ భాగస్వామితో భావోద్వేగ బంధాన్ని పెంపొందించడానికి ఎంతో సహాయపడుతుంది. అలాగే ఇది మీ బంధాన్ని బలోపేతం చేస్తుంది. అయితే కొన్నిసార్లు అలసట, పని లేదా ఒత్తిడి మిమ్మల్ని ఆ క్షణాలను ఆస్వాదించనివ్వవు. దాని ప్రభావం రిలేషన్ షిప్ పై కూడా కనిపిస్తుంది. పోషకాల లోపం, తప్పుడు జీవనశైలి అలవాట్లు కూడా సెక్స్ లో త్వరగా అలసిపోయేలా చేస్తాయి. దీంతో చాలా మంది ఒత్తిడికి గురవుతుంటారు. అంతేకాదు చాలా మంది దీనికి కూడా మందులను వాడుతుంటారు. కానీ ఇది పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. నిపుణుల ప్రకారం.. కొన్ని రకాల ఆహారాలు కూడా మీ సెక్స్ స్టామినాను పెంచుతాయి. అలాగే సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొనడానికి సహాయపడతాయి. 
 

సెక్స్ స్టామినాకు, ఆహారానికి సంబంధం ఏమిటి?

పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత శక్తి అందుతుంది. అలాగే పోషకాలు లైంగిక హార్మోన్ల స్రావానికి, లైంగిక అవయవాలను ఉత్తేజపరచడానికి కూడా సహాయపడతాయి. సరైన పోషకాలను తీసుకోని వారు ఇతరుల కంటే లిబిడో, స్టామినాను కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. సరైన ఆహారాన్ని తీసుకునే వ్యక్తులకు ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువని నిపుణులు చెబుతున్నారు. సరైన పోషకాలు, ఆహారాలు శరీరంలో రక్త ప్రసరణను నియంత్రించడానికి సహాయపడతాయి. దీంతో సరైన మొత్తంలో ఆక్సిజన్ సన్నిహిత ప్రాంతానికి చేరుకుంటుంది. లిబిడో కూడా పెరుగుతుంది. సెక్స్ స్టామినా పెరగడానికి ఏం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 


Bananas

అరటిపండు

అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అలాగే ఇది శరీరంలోని అన్ని విధులు సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. ఇది గుండె, నరాలు, కండరాలను సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. పురుషులలో పురుషాంగం గట్టిపడటానికి, మహిళల్లో భావప్రాప్తికి చేరుకోవడానికి ఈ కారకాలన్నీ అవసరం. అరటిపండులోని పొటాషియం రక్తపోటును సాధారణంగా, సమతుల్యంగా ఉంచుతుంది. అలాగే గుండెను ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. ఇది లైంగిక సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. 
 

బచ్చలికూర

పబ్ మెడ్ సెంట్రల్ ప్రకారం.. బచ్చలికూరలో ఫోలేట్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫోలేట్ రక్త ప్రవాహాన్నిపెంచడానికి కూడా సహాయపడుతుంది. అలాగే ఈ ఆకుకూరలో మెగ్నీషియం కూడా ఉంటుంది. ఇది శరీరంలో లైంగిక హార్మోన్లను ప్రోత్సహిస్తుంది. దీంతో మీరిద్దరూ మరింత ఉత్సాహంగా ఉంటారు. సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొంటారు. 

వెల్లుల్లి

లైంగిక జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటే వెల్లుల్లిని మీ రోజువారి ఆహారంలో భాగం చేసుకోండి. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తనాళాల విస్తరణను ప్రోత్సహిస్తుంది. అలాగే నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని కూడా పెంచుతాయి. వెల్లుల్లిని తినడం వల్ల సన్నిహిత ప్రాంతంలో రక్త ప్రవాహం పెరుగుతుంది. ముఖ్యంగా ఇది పురుషాంగానికి రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. దీంతో ఆటోమెటిక్ గా లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుంది. 

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్ ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఈ చాక్లెట్ల మీ లైంగిక జీవితాన్ని చాలా అందంగా చేస్తుంది. డార్క్ చాక్లెట్ ను క్రమం తప్పకుండా తింటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. దీనిలో ఉండే ఫ్లేవనాయిడ్లు రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. రక్త ప్రసరణను మెరుగుపరచడం వల్ల లైంగిక కార్యకలాపాలపై సానుకూల ప్రభావం పడుతుంది. పురుషులు, మహిళల ఇద్దరిలో ఇది లైంగిక కోరికలను కలిగిస్తుంది. 

గుమ్మడికాయ గింజలు

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. గుమ్మడికాయ విత్తనాల్లో జింక్,  ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు పోషకాలు సెక్స్ హార్మోన్లను ప్రేరేపించడానికి సహాయపడతాయి. రసాయన ఆధారిత మందుల మాదిరిగా కాకుండా గుమ్మడికాయ విత్తనాలు ఎలాంటి దుష్ప్రభావాలను చూపవు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సెక్స్ స్టామినా పెరుగుతుంది. కాల్చిన గుమ్మడికాయ విత్తనాలను ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తినొచ్చు. 

దానిమ్మ

దానిమ్మను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సెక్స్ స్టామినా మెరుగుపడుతుంది. అలాగే ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొంటారు. ఇది మీ లైంగిక శక్తిని కూడా పెంచుతుంది. దానిమ్మ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని, అంగస్తంభనలను మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరిచి, మీ సన్నిహిత ప్రాంతానికి తగినంత ఆక్సిజన్ చేరుకోవడానికి సహాయపడుతుంది. 

Latest Videos

click me!