Relationship: అబద్ధం చెప్పారని బాధపడుతున్నారా.. అయితే అస్సలు చింతించకండి?

First Published | Aug 1, 2023, 12:31 PM IST

Relationship: భార్య భర్తల మధ్య ఎలాంటి దాపరికలు ఉండకూడదు అంటారు. కానీ అన్నీ నిజాలే మాట్లాడినా కూడా కాపురానికి చేటు వస్తుంది. అందుకే అప్పుడప్పుడు అబద్ధం కూడా మంచిదే. అదెలాగో  చూద్దాం.
 

 ఒక బంధం కలకాలం నిలవాలంటే వారి మధ్య ఎలాంటి రహస్యాలు ఉండకూడదు అంటారు పెద్దవారు. ఆ మాట నిజమే ఒకే మాట మీద ఉంది ఓకే నిర్ణయం తీసుకునే భార్యాభర్తల సంసారం ఎప్పుడూ సజావుగానే సాగుతుంది.
 

అలాంటి అన్యోన్యమైన దాంపత్యంలో కూడా ఒక్కొక్కసారి భాగస్వామితో అబద్ధం చెప్పవలసిన అవసరం ఏర్పడుతుంది. అందుకోసం ఆ భాగస్వామి గిల్టీగా ఫీల్ అవ్వవలసిన పనిలేదు ఎందుకంటే ఒక్కొక్కసారి అబద్ధాలు కూడా బంధాలని నిలబడతాయి అంటున్నారు రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్.
 


నిజమేనండి మనం చెప్పే చిన్న అబద్ధం వల్ల మన బంధం నిలబడుతుంది అంటే అబద్ధం చెప్పటం వల్ల తప్పు లేదు కదా అలా అని అబద్ధం భాగస్వామిని బాధపెట్టేదిగా ఉండకూడదు. మీకోసం మీ భార్య కష్టపడి వంట చేస్తుంది కానీ అందులో కొన్ని లోటుపాట్లు ఉంటాయి.
 

అలా అని మీరు ఆ పొరపాటులని ఎత్తి చూపించడం వలన ఆమె బాధపడుతుంది వంట చాలా రుచిగా ఉందంటూ మెచ్చుకోవటం వల్ల ఆమె సంతోషపడుతుంది. అలాగే ఏదో ఒక సందర్భంలో మీ భర్త మీకోసం ఒక చీర గిఫ్ట్ గా తీసుకుని వచ్చి ఉండవచ్చు.
 

అది నిజానికి మీకు నచ్చకపోవచ్చు కానీ అతని సంతృప్తి కోసం అతని ప్రేమాభిమానాలని దృష్టిలో పెట్టుకొని చీర చాలా బాగుంది అని చెప్పవచ్చు అది ఎదుటి వ్యక్తికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే ఫైనాన్స్ విషయాలు కూడా మగవారు ఆర్థిక అసమానతలను తట్టుకున్నట్లుగా ఆడవారు తట్టుకోలేకపోవచ్చు.
 

 కాబట్టి వ్యాపారంలో జరిగే చిన్న చిన్న నష్టాల గురించి కానీ, చిన్నచిన్న అప్పుల గురించి గానీ అబద్ధాలు చెప్పవచ్చు. మీరు చెప్పే అబద్ధం ఎలా ఉండాలి అంటే అవతలి వాళ్ళు తెలుసుకునే లోపు ఆ సమస్య నుంచి మీరు బయట పడే విధంగా ఉండాలి. అలా చేయటం వలన ఫైనాన్షియల్ టెన్షన్స్ అయినా మరే రకమైన టెన్షన్స్ అయినా మీతోనే పోతుంది. మీ భాగస్వామి వరకు వెళ్లకపోవటం వలన ఆమె ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి అబద్ధం చెప్పాననే  గిల్టీ ఫీల్ అక్కర్లేదు.

Latest Videos

click me!