ఉల్లి, వెల్లుల్లి లను తింటే శృంగారంలో రెచ్చిపోతారా?

First Published | Aug 1, 2023, 9:39 AM IST

ఆయుర్వేదం ప్రకారం.. ఉల్లిపాయలు, వెల్లుల్లి లను తింటే సెక్స్ డ్రైవ్ పెరుగుతుంది. ఈ రెండు మీ లిబిడోను పెంచుతాయి. అలాగే ఇవి మీ సెక్స్ సామర్థ్యాన్ని కూడా పెంచుతాయంటున్నారు నిపుణులు. 
 

ఉల్లిపాయ, వెల్లుల్లి ఉన్న ఏ వంటకమైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఇవి ఆ వంట రుచిని పెంచుతాయి. ఈ రెండు పదార్థాలు రుచిని పెంచడమే కాకుండా.. మన శరీరానికి ఎన్నో పోషకాలను కూడా అందిస్తాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. దగ్గు, జలుబు ను తగ్గించడం నుంచి మన రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం వరకు అనేక వ్యాధులకు, ఆరోగ్య సమస్యలకు వెల్లుల్లి దివ్యౌషధంలా పనిచేస్తుంది.
 

లిబిడోను పెంచడంలో.. 

కానీ ఉల్లిపాయలు, వెల్లుల్లి లిబిడోను పెంచడానికి, మీ లైంగిక జీవితాన్ని ఉత్తేజపరచడానికి సహాయపడతాయన్న ముచ్చట మాత్రం చాలా మందికి తెలియదు. 
 


garlic

వెల్లుల్లి 

వెల్లుల్లి ఆరోగ్యానికి మాత్రమే కాదు సెక్స్ డ్రైవ్ ను కూడా మెరుగుపరుస్తుందని నిపుణులు అంటున్నారు. వెల్లుల్లిలో అల్లిసిన్ ఉండటమే దీనికి ప్రధాన కారణం. అల్లిసిన్ అనేది ఒక సమ్మేళనం. ఇది పురుషులు, మహిళలు ఇద్దరిలో లైంగిక అవయవాలకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది
 

Garlic

దీని ప్రభావాన్ని చూడాలంటే వెల్లుల్లిని ఎక్కువ సేపు తినాలి. సుమారు ఒక నెల పాటు ప్రతిరోజూ మీ ఆహారంలో కొద్ది మొత్తంలో వెల్లుల్లిని చేర్చితే దీని ప్రయోజనాలను పొందుతారు. ఇది మీ లిబిడోను  పెంచడానికి కూడా సహాయపడుతుంది.

వెల్లుల్లి విటమిన్ బి 6 కు మంచి మూలం. ఇది మీ రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాదు మీ మానసిక స్థితిని కూడా పెంచుతుంది. వెల్లుల్లి నిద్రలేమి, అలసట, ఆందోళనతో సంబంధం ఉన్న లక్షణాల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. వెల్లుల్లిలో కామోద్దీపన లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి మీ సెక్స్ డ్రైవ్ ను పెంచుతాయి.
 

garlic

ఇది ఎలా పనిచేస్తుంది?

మహిళల్లో లిబిడోను పెంచడానికి వెల్లుల్లి యాక్టివ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది ఈస్ట్రోజెన్ ఎక్కువగా ఉండే ఆహారం కాబట్టి మహిళల్లో సెక్స్ డ్రైవ్ ను పెంచుతుంది. శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయి ఎంత ఎక్కువగా ఉంటే లిబిడో అంత ఎక్కువగా ఉంటుంది.
 

onion

ఉల్లిపాయ సహాయపడుతుందా?

ఉల్లిపాయలు కామోద్దీపన ఆహారాలలో ఒకటిగా ప్రసిద్ది చెందాయి. ఉల్లిపాయ లిబిడోను పెంచడానికి, పునరుత్పత్తి అవయవాలను బలోపేతం చేయడానికి బాగా సహాయపడుతుంది. ఉల్లిపాయలు శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతాయి. అలాగే మీ  లైంగిక సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడతాయి.
 

onion

తాజా ఉల్లిపాయ రసం టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుందని ఇరాన్లోని తబ్రేజ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన జంతు పరిశోధనలో తేలింది. అంతేకాకుండా స్త్రీ, పురుషులిద్దరిలోనూ లైంగిక అవయవాల ఆరోగ్యాన్ని ఇది మెరుగుపరుస్తుంది. దీంతో సెక్స్ డ్రైవ్ మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది.

ఇది ఎలా పనిచేస్తుంది?

ఉల్లిపాయలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. ఇది మీ జననేంద్రియాలతో సహా శరీరంలోని ప్రతి భాగానికి రక్త ప్రసరణను పెంచుతాయి. సెక్స్ డ్రైవ్ ను మెరుగుపరుస్తుంది. దీనితో పాటు ఉల్లిపాయ మీ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. దీంతో మీరు రోజంగా అలసిపోకుండా ఎనర్జిటిగ్ గా ఉంటారు. అంతేకాకుండా ఉల్లిపాయలు పురుషుల్లో వీర్యకణాలను పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. 

Latest Videos

click me!