ఆ వయస్సులోనూ శృంగారంలో చురుగ్గా ఉండాలంటే ఇలా చేయండి

First Published | Aug 1, 2023, 10:52 AM IST

ఈ వయస్సులోనే సెక్స్ లో  పాల్గొనాలి.. ఈ వయస్సులో సెక్స్ కు దూరంగా ఉండలని ఏం లేదు. నిజానికి సెక్స్ ను వృద్ధాప్యంలోనూ ఆస్వాధించొచ్చంటున్నారు నిపుణులు. కాకపోతే
 

ఆరోగ్యకరమైన శరీరానికి శృంగారం అవసరమని పలు పరిశోధనల్లో తేలింది కూడా. సెక్స్ మీ కేలరీలను బర్న్ చేయడమే కాకుండా గుండెను కూడా రక్షిస్తుంది. వయసు పెరిగే కొద్దీ మానసిక ఆరోగ్యానికి సెక్స్ ముఖ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది మీ ఒత్తిడిని తగ్గించడమే కాకుండా మెదడును ఉత్తేజపరుస్తుంది కూడా. అందుకే వృద్ధాప్యంలో కూడా లైంగికంగా చురుగ్గా ఉండాలి. 
 

వృద్ధాప్యంలో లైంగిక జీవితం పట్ల శ్రద్ధ ఎందుకు ముఖ్యం?

జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్ లో ఒక అధ్యయనం.. మానవులు సహజంగా సాన్నిహిత్యాన్ని కోరుకుంటారని సూచిస్తుంది. వయసు పెరిగే కొద్దీ ఈ అవసరం అస్సలు తగ్గదు. జీవితంలో వృద్ధాప్యంలోనే ఈ  కోరిక ఎక్కువగా ఉంటుంది. వృద్ధులకు జీవితం, పరిస్థితులు మారుతాయనే అనుకుంటారు. కొంతమంది తమ భాగస్వామిని కూడా కోల్పోతారు. జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్ ప్రకారం.. సానుకూల సన్నిహిత సంబంధాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలతో ముడిపడి ఉన్నాయి. ఆరోగ్యకరమైన లైంగిక జీవితం గుండె, రక్తపోటు, ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది.
 


చాలాసార్లు వృద్ధ దంపతులు పిల్లల సంతోషం కోసం వేర్వేరుగా నివసించాల్సి వస్తుంది. భావోద్వేగ అవసరాలు, కోరికల కారణంగా వారు కలిసి ఉండాలని కోరుకుంటారు. 60 ఏండ్లు దాటిన వెంటనే సెక్స్ గురించి మర్చిపోవాల్సిన అవసరం లేదు. జర్నల్ ఆఫ్ సెక్సువాలిటీ అండ్ కల్చర్ ప్రకారం.. వృద్ధాప్యంలో పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకూడదు. గుండె సమస్యలూ రాకూడదు. కానీ ఈ సమస్యలన్నింటీని తగ్గించడానికి సెక్స్ ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. సంతృప్తికరమైన లైంగిక జీవితం మిమ్మల్ని ఆనందంగా ఉంచడమే కాకుండా దీర్ఘకాలిక రోగాల ముప్పును తగ్గిస్తుంది. ఇది మీ జ్ఞాపకశక్తి, అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తుంది. 
 

తక్కువ లైంగిక కోరిక ఒక అడ్డంకి కావొచ్చు

జర్నల్ ఆఫ్ సెక్సువాలిటీ అండ్ కల్చర్ ప్రకారం.. వృద్ధాప్యంతో శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఇది లైంగిక సాన్నిహిత్యానికి ఆటంకం కలిగిస్తుంది. ఈ మార్పులు మహిళల్లో యోని పొడిబారడం, తక్కువ లైంగిక కోరికల నుంచి పురుషులలో అంగస్తంభన వరకు ఎన్నో సమస్యలను కలిగిస్తుంది. దీర్ఘకాలిక నొప్పి, కదలిక తగ్గడం, శస్త్రచికిత్స నుంచి కోలుకోవడం కూడా లైంగిక సాన్నిహిత్యానికి ఆటంకం కలిగిస్తుంది. వీటిని అధిగమించడానికి స్కిన్ సెక్యూర్ సెక్స్ టాయ్స్, లూబ్రికెంట్స్, వైబ్రేటర్ల సహాయం తీసుకోవచ్చు.  వృద్ధాప్యంలో సెక్స్ ను ఎంజాయ్ చేయడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

ఒకరికొకరు తోడుగా..

సాన్నిహిత్యం ఎప్పుడూ కూడా ఇద్దరు వ్యక్తులను దగ్గర చేసేదిగా ఉండాలి. అంటే మీకు అన్ని ఆలోచనలు, భయాలు, భావాలను ఒకరికొకరు చెప్పుకోవాలి. అలాగే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ప్రతి రోజు ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవాలి.
 

sex life

కొత్తదాన్ని ప్రయత్నించండి 

భాగస్వామితో మాటలు రిపీట్ అవుతూనే ఉంటాయి. కాబట్టి సాధారణం కంటే డిఫరెంట్ గా ఏదైనా చేయండి. ఏదో ఒక రోజు ఇంటి నుంచి బయటకు వెళ్లి హాయగా సమయాన్ని గడపండి. కొత్త ప్రదేశాలను 
చూడటానికి వెళ్లండి. 

కలిసి పనులు చేయండి

బిజీ లైఫ్ స్టైల్ వల్ల ఒకరినొకరు పట్టించుకోరు. ఇది సాన్నిహిత్యాన్ని దెబ్బతీస్తుంది. భాగస్వామితో సాన్నిహిత్యం పెంచుకోవాలంటే వారిని అభినందించడం, వారికి ఇష్టమైన ఆహారాన్ని తయారు చేయడం లేదా సాధారణంగా ఇంటి పనులు చేయడం వంటి పనును చేయండి. ఇవి మీ సాన్నిహిత్యాన్ని పెంచుతాయి.
 

ఒకరికొకరు సమయాన్ని సెట్ చేసుకోండి 

పిల్లల్ని చూడటానికి వెళ్లడం, హాస్పటల్ల చుట్టూ తిరగడం వంటి ఇతర జీవిత కట్టుబాట్ల వల్ల జీవిత భాగస్వామి గడిపే సమయం తక్కువగా ఉంటుంది. నెలలో ఏదో ఒక రోజు బయట ఒక కప్పు కాఫీ తాగడానికి ప్లాన్ చేసుకోండి. అప్పుడప్పుడు బయటకు వెళుతూ ఉండండి. ఇది మీ సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. 
 

Latest Videos

click me!