Relationship: మీది సరదాలా సంసారం అవ్వాలా.. అయితే తప్పకుండా ఈ లక్షణాలు ఉండి తీరాల్సిందే!

First Published | Aug 29, 2023, 12:00 PM IST

 Relationship: ఒక బంధం మన జీవితంలోకి రావడం గొప్ప కాదు, ఆ బంధాన్ని నిలబెట్టుకోవడం గొప్ప. అలాంటి బంధం జీవితకాలం నిలబడాలంటే మీకు ఈ లక్షణాలు కచ్చితంగా ఉండి తీరాలి. అవేంటో చూద్దాం.
 

పెళ్లి అయినా కొత్తలో ఏ జంట అయినా కాలం తెలియకుండానే లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ గడిపేస్తూ ఉంటారు. అయితే అదే ఆనందం, అదే సంతోషం జీవితకాలం ఉండాలంటే మీకు కొన్ని లక్షణాలు ఉండి తీరాలి అంటున్నారు రిలేషన్ ఎక్స్పర్ట్స్. అవేంటో చూద్దాం. పెళ్లయి ఐదేళ్లయింది, పదేళ్లయింది ఇంకా సరసాలు ఏమిటి అనుకోకండి.
 

మీ జీవితం నిత్య నూతనంగా ఉండాలంటే మీ భార్యాభర్తలు ఇద్దరు ఒకరుని ఒకరు సరదాగా ఆట పట్టించుకుంటూ ఉండాలి. రిలేషన్ ఎక్స్పర్ట్స్ చేసిన ఒక పరిశోధనలో ఇలా ఆటపట్టించుకుంటున్న దంపతుల మధ్య అనురాగం ఎక్కువగా ఉన్నట్టు కనుగొన్నారు.
 


అలాగే మీ భాగస్వామిని ఎప్పుడూ మెచ్చుకుంటూ మాట్లాడండి. నువ్వు దొరకడం నా అదృష్టం, నీ వల్లే నా లైఫ్ చాలా బాగుంది అనే మాటలు మీ భాగస్వామిలో ఉత్సాహాన్ని రెట్టించేలాగా చేయటమే కాక మీ మీద మరింత అనురాగాన్ని కలిగేలాగా చేస్తాయి.
 

అలాగే బంధం కలకాలం నిలవాలంటే చిన్న చిన్న సరదా తగాదాలు కూడా అప్పుడప్పుడు అవసరం కాబట్టి కావాలనే భాగస్వామితో చిలిపి తగాదాలు పెట్టుకోండి. అలాగే ఒకరి పనుల్లో ఒకరు సాయం చేసుకోవడం వలన కలిపి గడిపే సమయం ఎక్కువగా ఉంటుంది.
 

కాబట్టి మీ మధ్య అన్యోన్యత మరింత పెరుగుతుంది. మీరిద్దరూ లైఫ్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కనీసం ఒక్క పూటైనా కలిసి భోజనం చేయడానికి ప్రయత్నించండి. ఆ రోజులో జరిగినవన్నీ మీ భాగస్వామితో షేర్ చేసుకోవడం వలన మీ ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ఉంటుంది.
 

అలాగే మీ భాగస్వామికి ఆరోగ్యం బాగోలేనప్పుడు ఎంతమంది పని వాళ్ళు ఉన్నప్పటికీ మీరు తీసుకునే కేర్ ఆమెకి ఎంతో ఊరట నిస్తుందని గుర్తుంచుకోండి. దగ్గరుండి సేవలు చేయటం వలన మానసికంగా ఆమె త్వరగా కోలుకోవటంతో పాటు మీకు కూడా చాలా తృప్తి కలుగుతుంది. కాబట్టి ఈ లక్షణాలని ఫాలో అయి చూడండి. మీ భాగస్వామిలో మార్పుని మీరే గమనిస్తారు.

Latest Videos

click me!