వర్షాకాలంలో ఈ లైంగిక సమస్యలొస్తాయ్.. తగ్గాలంటే ఇలా చేయాల్సిందే..!

First Published | Aug 28, 2023, 3:44 PM IST

వర్షాకాలంలో ఆడవారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీనివల్ల వీరికి యోని ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. అయితే వర్షాకాలంలో ఆడవారికి సెక్స్ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. 
 

వాతావరణ మార్పులు కూడా లైంగిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఈ సీజన్ లో వచ్చే తేమ అసౌకర్యానికి దారితీస్తుంది. అలాగే తేమ బ్యాక్టీరియా పెరగడానికి దారితీస్తుంది. ఇది యోని ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. వర్షాకాలంలో దురద, దద్దుర్లు, చికాకు వంటి సమస్యలు పెరుగుతాయి. మీ భాగస్వామితో వర్షాకాలంలో సెక్స్ సమస్యలను నివారించాలనుకుంటే పరిశుభ్రత, సౌకర్యం వంటి సవాళ్లను పరిష్కరించడం చాలా ముఖ్యం.
 

వర్షాకాలం, లైంగిక సమస్యల పెరుగుదలకు మధ్య ప్రత్యక్ష సంబంధం లేనప్పటికీ.. లైంగిక ఆరోగ్యం , సాన్నిహిత్యానికి సంబంధించిన సమస్యలకు దోహదం చేసే కొన్ని అంశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ సీజన్ లో గాలిలో ఎక్కువ తేమ అసౌకర్యం, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. ఇది మీ మొత్తం శ్రేయస్సును , లిబిడోను ప్రభావితం చేస్తుంది. అలాగే ఈ వాతావరణం కారణంగా మూడ్ స్వింగ్స్ సాన్నిహిత్యాన్ని ప్రభావితం చేస్తుంది. మరి వర్షాకాలంలో సెక్స్ సమస్యలు రావొద్దంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 


వ్యక్తిగత పరిశుభ్రత

వర్షాకాలంలో తేమ స్థాయి పెరగడం వల్ల శిలీంధ్రాలు, బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది అంటువ్యాధులకు కారణమవుతుంది. తడి బట్టలతో ఎక్కువ సేపు ఉండటం వల్ల కూడా ఇన్ఫెక్షన్ సమస్యలు పెరుగుతాయి. కొంతమందికి వర్షాకాలంలో అలెర్జీలు కూడా వస్తాయి. ఇది అసౌకర్యానికి దారితీస్తుంది. లైంగిక కార్యకలాపాలపై ఆసక్తి తగ్గుతుంది. అందుకే అసౌకర్యం, సంభావ్య అంటువ్యాధులను నివారించడానికి మంచి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం చాలా ముఖ్యం. అలాగే క్రమం తప్పకుండా జననేంద్రియ పరిశుభ్రతను నిర్ధారించడం కూడా ముఖ్యమే. చర్మ సమస్యలు,  అంటువ్యాధులను నివారించడానికి గాలి తగిలే దుస్తులను వేసుకోవాలి. తడి బట్టలను వెంటనే మార్చుకోవడం మంచిది.
 

లిబిడోపై ప్రభావం

ఈ సీజన్ లోని తేమ మీ శక్తి స్థాయిలు, మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. ఇది కొన్నిసార్లు లిబిడో తగ్గడానికి దారితీస్తుంది. హార్మోన్ల మార్పులు, సూర్యరశ్మిలో తక్కువగా ఉండటం వల్ల ఈ సమస్య వస్తుంది. తక్కువ లిబిడో సమస్యను పోగొట్టడానికి క్రమం తప్పకుండా శారీరక శ్రమలో పాల్గొనండి. లిబిడోను పెంచే ఆహారాలు ఎక్కువగా ఉన్న సమతుల్య ఆహారాన్ని తీసుకోండి. 
 

సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండండి

వర్షాకాలంలో జలుబు, ఫ్లూ, నీటి ద్వారా వచ్చే వ్యాధులు వంటి వైరల్ రోగాల సమస్యలు పెరుగుతాయి. ఇది అసౌకర్యానికి దారితీస్తుంది. అలాగే లైంగిక కోరికను ప్రభావితం చేస్తుంది. దీనిని నివారించడానికి జంటలు విటమిన్లు ఎక్కువగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. హైడ్రేట్ గా ఉండాలి. అలాగే మంచి పరిశుభ్రత చిట్కాలను పాటించడం వంటి జాగ్రత్తలను తీసుకోవాలి. అలాగే సురక్షితమైన శృంగార పద్దతులను పాటించడం వల్ల అంటువ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం తగ్గుతుంది. 
 


కలిసి నాణ్యమైన సమయాన్ని గడపండి

వర్షాకాలం జంటలకు రొమాంటిక్ గా ఉంటుంది. ఈ వాతావరణం జంటలు కలిసి నాణ్యమైన సమయాన్ని గడపడానికి సరైన అవకాశాన్ని అందిస్తుంది. కలిసి భోజనం  చేయడం, సినిమాలు చూడటం లేదా పుస్తకాలు చదవడం వంటి సౌకర్యవంతమైన ఇండోర్ కార్యకలాపాలను ఆస్వాదించడం వల్ల భాగస్వాముల మధ్య భావోద్వేగ బంధాం బలోపేతం అవుతుంది. ఇలాంటి కార్యకలాపాలు సాన్నిహిత్యం భావాన్ని పెంపొందిస్తాయ. ఇది ఒత్తిడిని తగ్గించడానికి, మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది.
 

ఓపెన్ కమ్యూనికేషన్

భాగస్వాముల మధ్య ఓపెన్ కమ్యూనికేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఇది మీ బంధాన్ని బలపరుస్తుంది. విడిపోయే అవకాశాలను తగ్గిస్తుంది. వర్షాకాలంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నా.. మీ భాగస్వామికి నిర్మొహమాటంగా చెప్పండి. లిబిడో తగ్గడం, వాతావరణ సంబంధిత కారణాల వల్ల అసౌకర్యం లేదా ఇతర సమస్యలను కూడా చెప్పండి. ఈ విషయాలను చెప్పడం వల్ల ఈ సమస్యలను పరిష్కరించొచ్చు. అయితే మీరు కమ్యూనికేట్ చేసేటప్పుడు నిజాయితీగా ఉంటే భాగస్వాముల మధ్య తలెత్తే  సమస్యలు తగ్గిపోతాయి. ఓపెన్ కమ్యూనికేషన్ మీ భావోద్వేగ బంధాన్ని బలోపేతం చేస్తుంది. అలాగే సాన్నిహిత్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. 
 

Latest Videos

click me!